భారత్ -చైనా సరిహద్దు సమీపంలో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర ప్రమాదం విషాదం నింపింది. సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.
శుక్రవారం ఉత్తర సిక్కిం సమీపంలో జెమా ప్రాంతంలో ఏటవాలు వాలులో వారి వాహనం కొండపైనున్న రహదారి నుంచి జారిపోవడంతో 16 మంది ఆర్మీ సైనికులు మరణించారు. నలుగురు గాయపడ్డారు.
ఈ ఉదయం మూడు వాహనాలతో ఆర్మీ కాన్వాయ్ ఛట్టెన్ నుంచి థంగు ప్రాంతంలోని బోర్డర్ పోస్ట్ లకు వెళుతుండగా మార్గమధ్యంలో ఇందులోని ఓ వాహనం దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైంది.
మూల మలుపు తిరుగుతుండగా అదుపు తప్పి లోయలో పడింది. ఘటన సమయంలో ట్రక్కులో 20 మంది జవాన్లు జూనియర్ కమిషన్ అధికారులున్నారు. వందల అడుగుల ఎత్తు నుంచి పడడంతో వాహనం తునాతునకలైంది.
రెస్క్యూ మిషన్ టీం వెంటనే రంగంలోకి దిగి పని ప్రారంభించింది. గాయపడిన నలుగురు సైనికులను గాలికి తరలించారు. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ముగ్గురు జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు మరియు 13 మంది సైనికులు గాయపడ్డారు” అని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాద సమయంలో 16 మృతదేహాలను అధికారులు గుర్తించారు. వారిని హెలిక్యాప్టర్లలో ఉత్తర బెంగాల్ లోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలిపారు.’ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వారి సేవ మరియు నిబద్ధతకు దేశం ఎంతో కృతజ్ఞతలు తెలుపుతోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని రాజ్నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు.