అవసరం ఏదైనా కానీ.. ధ్రువీకరణ అన్నంతనే వచ్చే మాట.. ఆధార్. ప్రతి ఒక్క చోట ఆధార్ అవసరమే. అదే లేకుంటే పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మరి.. అలాంటి ఆధార్ ను తీసుకొని పదేళ్లు అయితే.. దాన్ని వెంటనే అప్డేట్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఆధార్ కార్డు జారీ అయ్యాక.. పదేళ్ల కాలంలోఅప్డేట్ కాని వారంతా తమ ఆధార్ కార్డుల్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
చిన్న పిల్లలు మొదలు పెద్ద వయస్కుల వారి వరకు ప్రతి ఒక్కరు తమ ఆధార్ ను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోజువారీ జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఆధార్ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి. అంతటి కీలకమైన ఆధార్ ను పదేళ్లకు ఒకసారి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
తాజాగా భారత విశిష్ట ప్రాధికార సంస్థ ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలని కోరింది.
ఇందులో భాగంగా ఆధార్ లో మన డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవటానికి వీలుగా ఆధార్ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన అప్డేట్ డాక్యుమెంట్ అనే ఫీచర్ ను తాజాగా జత చేసింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో యూజర్లు తమ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన పత్రాల్ని అప్డేట్ చేసుకోవచ్చని.. తమ వద్ద ఉన్న ఆధార్ కేంద్రాల ద్వారా అప్డేట్ చేసుకోవచ్చిన పేర్కొన్నారు.
దేశంలో అమలవుతున్న 1100లకు పైగా ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అన్నది మర్చిపోకూడదు. దీని ద్వారానే లబ్థిదారుల్ని ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసినప్పుడు దేశంలో ఇప్పటివరకు 134 కోట్ల ఆధార్ నెంబర్లు జారీ అయ్యాయి.
ప్రస్తుతం తాము నివసిస్తున్న చిరునామాకు అనుగుణంగా ఆధార్ ను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇందుకోసం గత నెలలో ఆధార్ నిబంధనల్ని మార్చి.. పదేళ్లకు ఒకసారి ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలన్న సూచన చేశారు. మరెందుకు ఆలస్యం.. మీ ఆధార్ ను అప్డేట్ చేసుకోండి.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…
Nicv information