గుడివాడ క్యాసినోలో దాదాపు 500 కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు..ఆధారాలను ఐటీ అధికారులకు అందజేసిన టీడీపీ నాయకులు..!

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 20:

మాజీ మంత్రి కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు ఐటీ ఉచ్చు బిగుసుకుంటోందా?  ఈ ఏడాది సంక్రాంతి సమయంలో గుడివాడ అడ్డాగా నిర్వహించిన క్యాసినోపై ఐటీ అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గుడివాడ క్యాసినోపై గతంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు ఆదాయపన్ను(ఐటీ) శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ ఇక్కడ జరిగిన క్యాసినోపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న ఆధారాలను ఐటీ అధికారులకు టీడీపీ నాయకులు తాజాగా అందజేశారు. దీంతో ఐటీ విచారణ మరింత ముమ్మరం కానుంది.  

గుడివాడ క్యాసినో ఆరోపణలకు సంబంధించిన వివరాలను తెలుగుదేశం బృందం.. ఐటీశాఖ అధికారులకు అందజేసింది. కొడాలి నాని వల్లభనేని వంశీ నేతృత్వంలో క్యాసినో నిర్వహించారంటూ.. టీడీపీ గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తోపాటు వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలకు ఫిర్యాదు చేసింది. వాటికి సంబంధించిన వివరాలు అందించాలని.. వర్ల రామయ్యను ఆదాయపు పన్నుశాఖ కోరింది. ఈ వివరాలను అందించేందుకు వర్ల రామయ్య బొండా ఉమ కొనకళ్ల నారాయణ రావి వెంకటేశ్వరరావు.. విజయవాడలోని ఐటీ కార్యాలయానికి వెళ్లారు.పేరుకు ఎడ్ల పందాలు పెడుతున్నామని.. వెనక క్యాసినో నడిపారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. గుడివాడలో క్యాసినో నిర్వహిస్తున్నామని చికోటి ప్రవీణ్ ప్రచారం చేసిన ఆధారాలను ఐటీ అధికారులకు అందించామని ఆయన వెల్లడించారు. చికోటి ప్రవీణ్ తనకు స్నేహితుడేనని వంశీ స్వయంగా చెప్పారని ఆరోపించారు. ఈ వ్యవహరంలోకి కొడాలి నాని వేలాది మందిని రప్పించారని తెలిపారు. వేలకు వేలు ఎంట్రీ ఫీజులు పెట్టారని తెలిపారు.

గుడివాడ క్యాసినోలో దాదాపు 500 కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయని అన్నారు. హవాలా రూపంలో ఆ నగదును దారి మళ్లించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. హవాలా సొమ్మును దారి మళ్లించేందుకు చికోటి సాయపడ్డారని.. దీనిలో ఎంత మొత్తం చేతులు మారాయనేది తమ వద్దనున్న వివరాలను ఐటీకి ఇచ్చామని తెలిపారు. క్యాసినో గురించి రాష్ట్ర అధికారులు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. అందుకే కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.మాజీ మంత్రి కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు ఐటీ ఉచ్చు బిగుసుకుంటోందా?  ఈ ఏడాది సంక్రాంతి సమయంలో గుడివాడ అడ్డాగా నిర్వహించిన క్యాసినోపై ఐటీ అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గుడివాడ క్యాసినోపై గతంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు ఆదాయపన్ను(ఐటీ) శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ ఇక్కడ జరిగిన క్యాసినోపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న ఆధారాలను ఐటీ అధికారులకు టీడీపీ నాయకులు తాజాగా అందజేశారు. దీంతో ఐటీ విచారణ మరింత ముమ్మరం కానుంది.  

గుడివాడ క్యాసినో ఆరోపణలకు సంబంధించిన వివరాలను తెలుగుదేశం బృందం.. ఐటీశాఖ అధికారులకు అందజేసింది. కొడాలి నాని వల్లభనేని వంశీ నేతృత్వంలో క్యాసినో నిర్వహించారంటూ.. టీడీపీ గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తోపాటు వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలకు ఫిర్యాదు చేసింది. వాటికి సంబంధించిన వివరాలు అందించాలని.. వర్ల రామయ్యను ఆదాయపు పన్నుశాఖ కోరింది. ఈ వివరాలను అందించేందుకు వర్ల రామయ్య బొండా ఉమ కొనకళ్ల నారాయణ రావి వెంకటేశ్వరరావు.. విజయవాడలోని ఐటీ కార్యాలయానికి వెళ్లారు.పేరుకు ఎడ్ల పందాలు పెడుతున్నామని.. వెనక క్యాసినో నడిపారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. గుడివాడలో క్యాసినో నిర్వహిస్తున్నామని చికోటి ప్రవీణ్ ప్రచారం చేసిన ఆధారాలను ఐటీ అధికారులకు అందించామని ఆయన వెల్లడించారు. చికోటి ప్రవీణ్ తనకు స్నేహితుడేనని వంశీ స్వయంగా చెప్పారని ఆరోపించారు. ఈ వ్యవహరంలోకి కొడాలి నాని వేలాది మందిని రప్పించారని తెలిపారు. వేలకు వేలు ఎంట్రీ ఫీజులు పెట్టారని తెలిపారు.

గుడివాడ క్యాసినోలో దాదాపు 500 కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయని అన్నారు. హవాలా రూపంలో ఆ నగదును దారి మళ్లించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. హవాలా సొమ్మును దారి మళ్లించేందుకు చికోటి సాయపడ్డారని.. దీనిలో ఎంత మొత్తం చేతులు మారాయనేది తమ వద్దనున్న వివరాలను ఐటీకి ఇచ్చామని తెలిపారు. క్యాసినో గురించి రాష్ట్ర అధికారులు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. అందుకే కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

Related Posts

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

Spread the love

Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

Spread the love

Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్