సెల్ ఫోన్ పోయిందా..ముందు ఈ సేవ లో రూ 200 చలనా కట్టండి..తరువాతే పోలీస్ కంప్లైంట్..!

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 15 :

సెల్ ఫోన్.. ఇప్పుడు జీవితంలో ఒక భాగంగా మారటమే కాదు.. శరీరంలో అవయువం కాని అవయువంగా మారిందన్నది తెలిసిందే. ఇవాల్టి రోజున సెల్ ఫోన్.. అందులో డేటా.. దాన్లో వాట్సాప్.. గూగుల్ పే.. పేటీఎం.. ఫోన్ పే లాంటి యాప్ లు లేని జీవితాన్ని ఊహించగలమా? నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అనుక్షణం సెల్ చుట్టూ తిరిగే ఈ రోజుల్లో ఆ ఫోన్ కానీ పోతే కలిగే నష్టం.. కష్టం అంతా ఇంతా కాదు. ఇలాంటి బాధలో ఉన్నప్పుడు తక్షణమే గుర్తుకు వచ్చేది పోలీస్ స్టేషన్.

అలాంటి పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. సెల్ ఫోన్ పోయింది.. కాస్త వెతికి పెట్టండి అన్న రిక్వెస్టు చేసినంతనే.. వారో నిబంధనల చిట్టా ఓపెన్ చేసి.. వివరాలు చెప్పటం మొదలు పెడితే ఎలా ఉంటుంది? కాలిపోదు. అవును.. అలా కాలిపోయేలా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విధానాల్ని అమల్లోకి తీసుకొచ్చింది.గతంలో మాదిరి సెల్ పోతే పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. ఫిర్యాదు రాసి.. వారి నుంచి రశీదు తీసుకుంటే సరిపోయేది. కానీ..ఇకపై అలాంటి పప్పులు ఉడకవ్. కారణం.. సెల్ ఫోన్లు పోగొట్టుకునే వారి సంఖ్య భారీగా పెరిగిపోయి.. నిత్యం ఆయా పోలీస్ స్టేషన్లకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో.. దానికో తిర’కాసు’ ప్రొసీజర్ ను తెర మీదకు తీసుకొచ్చింది. దాని ప్రకారం చూస్తే.. సెల్ ఫోన్ బాధకు కొత్త విధానానికి సంబంధించిన పెయిన్ మరింత ఎక్కువ చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

ఈ కొత్త విధానంలో పోయిన ఫోన్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. కానీ.. ఫోన్ పోగొట్టుకున్న బాధితులు మాత్రం..తొలుత మీ సేవా కేంద్రానికి వెళలాలి. అక్కడ రూ.200 చొప్పున చలానా కట్టాలి. ఆ కట్టిన మొత్తంలో రూ.145 ప్రభుత్వ ఖాతాకు వెళితే.. మిగిలిన మొత్తం మీ సేవా కేంద్రానికి వెళుతుంది. ఈ చలానా లెక్క ఎందుకు తీసుకొచ్చారంటే.. సెల్ ఫోన్ పోయిన కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతుందని.. అందుకే వాటికి సంబంధించిన పని చేయటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి.. ఈ సర్ ఛార్జ్ ను తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు.తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఏపీలో మాత్రం ఆన్ లైన్ ద్వారా పోయిన ఫోన్ కు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చే సౌకర్యం ఉంది. నిజానికి ఒక్క ఏపీలోనే కాదు.. చాలా రాష్ట్రాల్లో ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. అందుకు భిన్నంగా కేసీఆర్ సర్కారు మాత్రం మీ సేవలో చలానా కట్టిన తర్వాత పోయిన సెల్ ఫోన్ గురించి కంప్లైంట్ చేయొచ్చన్న కొత్త రూల్ ఇబ్బందికరంగానే కాదు.. బాధితులకు ఉన్న బాధను మరింత పెంచేలా చేస్తుందంటున్నారు. మరి.. ఈ విషయంలో కేసీఆర్ సర్కారు పునరాలోచన చేస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.

  • Related Posts

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    Spread the love

    Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    Spread the love

    Spread the love (జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి) హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి విశ్వ ప్రగతి పాఠశాలను మూసి వేయడం జరిగింది .దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెంది విశ్వ ప్రగతి పాఠశాల నుండి ర్యాలీగా వెళుతూ హుజురాబాద్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు