హీరో నాగార్జునకు రైతు బంధు డబ్బులు.. పక్కదారి పడుతున్న కేసిఆర్ రైతు బంధు నిధులు..!

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 15 :

తెలంగాణ సీఎం కేసీఆర్ మెజార్టీ పథకాలు రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చాయి. తెలంగాణలో భూమి ఉన్న వారందరికీ రైతు బంధు కింద సాయం అందించేలా కేసీఆర్ ఏర్పాట్లు చేశాడు. అయితే వందల ఎకరాలున్నా బడాబాబులకు దొరలకు సినీ రాజకీయ ప్రముఖులకు కూడా ఈ రైతు బంధు డబ్బులు పడుతుండడంపై విమర్శలు చెలరేగాయి. అయినా కూడా వాటిని పంపిణీ చేస్తూనే ఉన్నాడు. అప్పట్లో మహేష్ బాబు భూమికి కూడా రైతు బంధు వచ్చింది. ఇప్పుడు హీరో నాగార్జునకు కూడా రైతుబంధు అందుతోందట..

కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం రైతులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించే ఒక విప్లవాత్మకమైన పథకంగా పేరుగాంచింది. నిజానికి ఈ పథకం కొంత వరకు విజయవంతమైంది. దీన్ని ఆధారంగానే ఢిల్లీలోని మోడీ ప్రభుత్వం దానిని కాపీ కొట్టి కిసాన్ పేరిట దేశవ్యాప్తంగా రైతులకు నిధులు ఇస్తోంది. కానీ మోడీ సర్కార్ 5 ఎకరాల లోపువారికే పేదలకే ఇస్తున్నారు.

అయితే కేసీఆర్ సర్కార్ అమలు చేసే రైతు బంధు పథకంలో అనేక లొసుగులు ఉన్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 600 ఎకరాలు కలిగి ఉంటే తెలంగాణ ప్రభుత్వం పంటకాలం ఫసలుకు అందించే  5000 రూపాయలతో గుణించిన డబ్బు అతని బ్యాంకు ఖాతాలో సంవత్సరానికి రెండుసార్లు జమ అవుతుంది. ఇది భారీ డబ్బు.. లక్షల్లోనే ఆ వ్యక్తికి డబ్బు అందుతుంది. అయితే ఆ భూమిని కౌలుకు తీసుకున్న వారికి మాత్రం రూపాయి దక్కదు.  ఈ పథకం కౌలు రైతుల సమస్యను పరిష్కరించలేదు. అలాగే ఈ స్కీమ్లో ఎలాంటి ఆర్థిక అడ్డంకులు వర్తించవు. ఆ లైన్లో చాలా మంది అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు మరియు ఇతర నాయకులు రైతు బంధు డబ్బును పొందుతున్నారు.

టాలీవుడ్ హీరో నాగార్జున అక్కినేనికి కూడా రైతుబంధు వస్తుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి వెల్లడించారు. హైదరాబాద్లో జరిగిన ఓ సదస్సులో ఆకునూరి మురళి మాట్లాడుతూ.. అమెరికాలో 30 ఏళ్లుగా పనిచేసిన వ్యక్తి నాకు తెలుసు. అతనికి తెలంగాణలో వ్యవసాయ భూములు ఉన్నాయి. రైతు బంధు డబ్బు అతని ఖాతాలో జమ అవుతుంది. హీరో నాగార్జున కూడా రైతు బంధు ప్రయోజనాలను పొందారు. ఇంత సంపన్నులకు ఇది అవసరమా? బదులుగా రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల్లో దాదాపు 22 లక్షల మంది కౌలు రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి” అని మురళి అన్నారు.అయితే నాగార్జునకు ఉన్న వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలను మురళి చెప్పలేదు. అయినప్పటికీ మాజీ బ్యూరోక్రాట్ వాదన నిజమైంది. ధనవంతులైన రైతులకు కాకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు రైతుబంధు ఆర్థిక సహాయం అందించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

  • Related Posts

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    Spread the love

    Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    Spread the love

    Spread the love (జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి) హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి విశ్వ ప్రగతి పాఠశాలను మూసి వేయడం జరిగింది .దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెంది విశ్వ ప్రగతి పాఠశాల నుండి ర్యాలీగా వెళుతూ హుజురాబాద్…

    One thought on “హీరో నాగార్జునకు రైతు బంధు డబ్బులు.. పక్కదారి పడుతున్న కేసిఆర్ రైతు బంధు నిధులు..!

    1. ఈ పథకం పెట్టినప్పటి నుండి నా పొలానికి చెందిన రైతుబంధు సహాయాన్ని “give it up” పాలసీ కింద తిరిగి ప్రభుత్వం వారికి చెందేటట్లు చేస్తున్నాను..నా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రభుత్వం యొక్క fiscal management కు నేను కూడా ఎంతో కొంత చేయూత ఇచ్చినట్లు ఉంటుందని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు