కాప్రా, జనసముద్రం న్యూస్,డిసెంబర్ 15:
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీలలో చిన్నపాటి శుభకార్యం జరిగినా హిజ్రాలు రెండు లేక మూడు ఆటోలలో పదిమందికి పైనే ఇట్టే వాలిపోతూ హల్ చల్ చేస్తున్నారు.
వేలకు వేలు డబ్బులు అడుగుతూ ఏమాత్రం ఆలస్యం జరిగినా వాళ్లు అడిగినంత ఇవ్వలేమని బతిమిలాడిన వినకుండా కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో నానా యాగి చేస్తూ అసభ్య ప్రవర్తనలతో ఇబ్బందులు పెడుతున్నారు.
గతంలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ సాయి నగర్ లో ఆడ కూతురు పెళ్లి ఇంట్లో హిజ్రాలు వెకిలి చేష్టలతో నానా బీభత్సం సృష్టించారు.
కాలనీవాసులందరూ ఏకమై హిజ్రాలను అడ్డుకొని ఆందోళనకు దిగడం జరిగింది.
ఈ విషయాన్ని అప్పుడే డయల్ 100 కు ఫోన్ చేయగా కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి హిజ్రాలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది.
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత కాలనీలోని మెడికల్ షాప్ లో ఉన్న మహిళ పట్ల ఓ హిజ్రా మందుల కోసం అని వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇదిలా ఉండగా…
10 రోజుల క్రితం దాబా గార్డెన్స్ సమీపంలోని ఓ కాలనీలో తెల్లవారు జాము జరిగిన గృహప్రవేశంలో రెండు ఆటోలలో వచ్చిన దాదాపు పదిమంది హిజ్రాలు 51 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నానా బీభత్సం సృష్టించి బెదిరింపులకు పాల్పడ్డారు.
గృహప్రవేశం చేసుకుంటున్న యజమానులు సునీత కృష్ణ దంపతులు వారి ఆగడాలకు భయపడి పదివేల రూపాయలు నగదు మరో 10 వేల రూపాయలను డిజిటల్ రూపంలో చదివించుకున్నారు.హిజ్రాల వికృత చేష్టలతో ఆందోళనకు గురైన ఇంటి యజమాని కృష్ణ ఆయాసంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి గృహప్రవేశం జరిగిన రోజునే ఆసుపత్రి పాలయ్యాడు.
ఆస్పత్రి లో పరీక్షలు రెండు రోజుల చికిత్స కోసం మరో 35000 చెల్లించుకున్న దయనీయ పరిస్థితి.
దయచేసి హిజ్రాల వేధింపుల విషయమై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని శివ సాయి నగర్ సంక్షేమ సంఘం, చర్లపల్లి కాలనీల సమాఖ్యCCS పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం.