రెండు వారాలు గడిచినా ఏపీలో ఉద్యోగులకు అందని జీతాలు..వేతనాలు పడని వారిలో ఎక్కువమంది ఉపాధ్యాయులే..!

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 13:

ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ఆర్థిక నిపుణులు ఐవైఆర్ శర్మ వంటి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సైతం జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోందని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ప్రతిపక్షాలే ఆరోపిస్తున్నట్టే ఏపీలో పరిస్థితులు సాగుతున్నాయని చెప్పుకుంటున్నారు. డిసెంబర్ నెల వచ్చి రెండు వారాలు గడుస్తోంది. అయినా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంకా చాలా మందికి ఇప్పటివరకు జీతాలు అందకపోవడం గమనార్హం. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో 45 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందలేదని ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి.

ఉద్యోగులకు వేతనాలు పెన్షన్ల రూపంలో ఇంకా రూ.2000 కోట్లు చెల్లించాలని ప్రధాన మీడియా పేర్కొంటోంది. ఈ నెలాఖరుకైనా అందుతాయో లేదోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. నెల మొదట్లో చెల్లించాల్సిన ఈఎంఐలు ఇతర కమిట్మెంట్స్ పిల్లల చదువులు ఇతర ఖర్చులకు డబ్బుల్లేక అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.డిసెంబర్ మొదటి రోజు నుంచీ జగన్ ప్రభుత్వం ఓవర్డ్రాఫ్టు (ఓడీ)లోనే ఉందని మీడియా కథనాలు తెలుపుతున్నాయి. అంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి బాకీ పడుతూనే ఉందని చెబుతున్నారు. కార్పొరేషన్లను తనఖా పెట్టి తెచ్చుకున్న అప్పులు కేంద్రం అనుమతిచ్చిన అప్పులు రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్ల ద్వారా దొడ్డిదారిన సమీకరిస్తున్న అప్పులు ఇంకా ఉద్యోగులు తమ జీతం నుంచి దాచుకున్న డబ్బులు చాలక ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ఏ రోజు అప్పు పుడితే ఆ రోజుకి తీసుకుని వాడేస్తోందని మీడియా కథనాలు వివరిస్తున్నాయి.

ఇలా జగన్ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి తెచ్చే అప్పులకు ఇతర అప్పుల్లాగా చెల్లించాల్సిన సమయం ఏళ్ల తరబడి ఉండదని చెబుతున్నారు. కనిష్టంగా 4 రోజుల నుంచి గరిష్టంగా 15 రోజుల వరకే ఉంటుంని వివరిస్తున్నారు. ఆర్బీఐ నుంచి ఇప్పటికే అప్పు తెచ్చిన జగన్ ప్రభుత్వం దాన్ని గడువులోగా చెల్లించలేకపోయిందని అంటున్నారు. అందుకే ఉద్యోగులకు జీతం రూపంలో అందాల్సిన డబ్బులను ఓవర్ డ్రాఫ్టు అప్పు గడువు దాటిపోవడంతో ఆర్బీఐ ఖజానా నుంచి ఎప్పటికప్పుడు డబ్బు మినహాయించుకుంటోందని వివరిస్తున్నారు.అందుకే జగన్ ప్రభుత్వం వద్ద ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడానికి ఖజానాలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదని అంటున్నారు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డిసెంబర్ నెల ప్రారంభంలోనే ఆర్బీఐ నుంచి ప్రభుత్వం వేజ్ అండ్ మీన్స్ స్పెషల్ డ్రాయల్ లిమిట్స్ ఓడీ పేరుతో దాదాపు రూ.4500 కోట్ల అప్పు తెచ్చి వాడేసిందని ప్రధాన మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ అప్పును ఏళ్ల తరబడి నెలల తరబడి ఉంచుకోవడానికి వీల్లేదని అంటున్నారు. ఈ అప్పుల్లో ఓవర్ డ్రాఫ్టు (ఓడీ) అప్పు రూ.1400 కోట్లు దాటితే ఆ దాటిన మొత్తాన్ని నాలుగు పని దినాల్లో రూ.1400 కోట్ల లోపు ఉంటే 14 పని దినాల్లోగా ఆర్బీఐకి చెల్లించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. ప్రభుత్వం చెల్లించకపోతే ఆర్బీఐ నేరుగా ఖజానా నుంచి మినహాయించుకుంటుందని పేర్కొంటున్నారు.

కాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా వేతనాలు పెన్షన్లు కలిపి రూ.5500 కోట్లు అవసరమవుతాయి. ఈ నెల ప్రభుత్వం 1 2 తేదీల్లో రూ.2600 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత వారానికి ఇంకో రూ.900 కోట్లు చెల్లించింది. అంటే మొత్తం రూ.3500 కోట్లను ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల రూపంలో చెల్లించింది. అయినా ఇంకా రూ.2500 కోట్లను చెల్లించాల్సి ఉండటం గమనార్హం.కాగా వేతనాలు పడని ఉద్యోగుల్లో ఎక్కువ మంది టీచర్లే ఉన్నారు. దీంతో వారంతా తమపై ప్రభుత్వం పగ బట్టిందని భావిస్తున్నారు. గతంలో తాము ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో వేతనాలు సకాలంలో ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తున్నారు.

Related Posts

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

Spread the love

Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం