

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 11:
ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆదివారం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం పలు అంశాలపై సజ్జల రామకృష్ణారెడ్డి తోపుదుర్తి సోదరులతో మరియు తోపుదుర్తి ఆత్మరామిరెడ్డి గారితో చర్చించారు.
