కెసిఆర్ కూతురు కవిత ఇంట్లో సీబీఐ సోదాలు..!లిక్కర్ స్కాంలో స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్న సీబీఐ అధికారులు

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 11:

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఉదయం 11 గంటల నుంచి సీబీఐ అధికారులు ఆమె నివాసంలో విచారిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో కవిత హస్తం ఉందన్న ఆరోపణలతో విచారిస్తున్నారు.

ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు కవిత నివాసానికి చేరుకున్నారు. మహిళా అధికారులతో సహా ఆరుగురు అధికారులు ఉన్నారు. కవిత వెంట న్యాయవాదులు ఉన్నారు. ఇందుకోసం గ్రౌండ్ ఫ్లోర్ లోనే ప్రత్యేక గదిని సిద్ధం చేసిన సిబ్బంది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత స్టేట్ మెంట్ ను సీబీఐ బృందం రికార్డ్ చేయనుంది. కవిత విచారణ ప్రారంభమైందని.. సిద్ధం చేసిన ప్రశ్నలను కవితను అడిగినట్టు తెలుస్తోంది. కొన్ని డాక్యుమెంట్లు కాల్ లిస్ట్ పై అధికారులు ప్రశ్నించారని.. సిసోడియా అరోరా అభిషేక్ విషయంలో కవితను సీబీఐ విచారించినట్టు సమాచారం.సీబీఐ డీఐజీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో కవిత విచారణ కొనసాగుతోంది. సీబీఐ బృందంలో 11 మంది అధికారులు ఉన్నారు. కవిత స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. సీబీఐ అడిగే ప్రశ్నలు కవిత ఇచ్చే సమాధానాలపై ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే కవితకు ఈనెల 6వ తేదీన విచారించాలని సీబీఐ నోటీసులు పంపింది. దానికి ఈనెల 11న అందుబాటులో ఉంటానని కవిత ప్రత్యుత్తరం పంపింది. ఈ నేపథ్యంలో నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కళకళలాడే కవిత నివాసం ప్రాంగణం బోసిపోయింది.పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి కవితకు సంఘీభావం తెలుపుతున్నారు. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ‘వి విత్ యూ కవితక్క’ పేరుతో ఆమె ఇంటి చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి