మహబూబాబాద్ ప్రతినిధి 08 డిసెంబర్ (జనసముద్రం న్యూస్):
సీతారామ ప్రాజెక్టుతో ఈ ప్రాంతం సస్యశ్యామలo మవుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని మున్నేరువాగు పై నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల కెనాల్ బ్రిడ్జి పనులను జడ్పీ చైర్మన్ కుమారి ఆంగోత్ బిందు జిల్లా కలెక్టర్ కొండూరు శశాంకతో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు 78.325 కిలో మీటర్ల నిడివితో ఉన్న కాలువ మన జిల్లాలో 15వ ప్యాకేజీలో డోర్నకల్, గార్ల మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని అందించాలని ఈ ప్రాంతంలో పరిశ్రమలు , రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, రైతులను అభివృద్ధికి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి- కృష్ణా (పాలేరు) నదుల అనుసంధానంలో 14,15వ ప్యాకేజీ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. చివరి ఆయకట్టైనా డోర్నకల్ కు రెండు పంటలకు నీరందడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు. డోర్నకల్ ప్రాంతంలో మిర్చి లిపిడ్ ప్లాంటు ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఈ శంకర్ నాయక్, ఈఈ వెంకటేశ్వర్లు, డిఈ రమేష్ రెడ్డి,తహసిల్దార్ స్వాతి బిందు తదితరులు పాల్గొన్నారు.