జనసముద్రం న్యూస్,డిసెంబర్ 3:
ఏపీలో టీడీపీ వైసీపీ నేతలు కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంటుంది. అలాంటిది తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఏపీ సీఎం జగన్కు థ్యాంక్స్ చెబుతున్నారు. కారణమేంటని ఆరా తీస్తే మాత్రం ఆశ్చర్యకరమైన సమాధానం ఇస్తున్నా తెలుగు తమ్మళ్లు. తమ అధినేత నారా చంద్రబాబు నాయుడి శైలిలో అనూహ్యమైన మార్పులను వై.ఎస్.జగన్ రెడ్డి తీసుకొచ్చారట. అంటే మార్పులకు కారణమయ్యారట. చంద్రబాబుకు తిరుగులేని అడ్మినిస్ట్రేటర్గా పేరుంది.అయితే అదే ఆయనకు బాగా మైనస్ కూడా అయింది. ఎంతసేపూ పాలనపైన దృష్టి సారించడమే తప్ప ప్రజల మనసులు దోచే అంశాలమీద ఫోకస్ పెట్టాలి అనే అంశాన్ని ఆయన ఇన్నాళ్లు పట్టించుకోలేదు. పైగా ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగించడంపైనా ఆయన మనసు పెట్టలేదు. చంద్రబాబు పాలనా శైలిని ఎంతగా మెచ్చుకుంటారో ఆయన ప్రసంగాలను మాత్రం అంత బోరింగ్గా ఫీలవుతుంటారు.
ఇప్పుడు చంద్రబాబు ప్రసంగాల్లో స్పష్టమైన మార్పు గోచరిస్తోందని తెలుగు తమ్ముళ్లు తెగ మురిసిపోతున్నారు. గతంలా లాగా ఊకదంపుడు ఉపన్యాసాలతో బాబుగారు బోరు కొట్టించకుండా స్ట్రెయిట్గా పాయింట్ పట్టుకుని వైసీపీ నేతలపై ఎదురు దాడి చేసి వారిని ఆత్మరక్షణలో పడేస్తున్నారట.
బహిరంగ సభల్లో కూడా ఘాటైన ప్రసంగాలతో జనాన్ని బాగా ఆకట్టుకోవడమే కాకుండా జనాల మనసు దోచుకునే విధంగా ఆయన శైలిలో మార్పు కనిపిస్తోంందట. మా చంద్రబాబులో ఈ మార్పు తేవడానికి సీఎం వై.ఎస్.జగనే కారణమంటూ తెలుగు తమ్మళ్లు తమ ఆంతరంగిక చర్చల్లో థ్యాంక్య జగన్ అని చెప్పుకొంటున్నారట.వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని మా నాయకుడి ప్రసంగం చాలా చాలా మెరుగుపడింది. ఇవాల్టి రోజున చంద్రబాబు ప్రసంగం వింటే.. వింటున్నది చంద్రబాబు మాటలేనా? అనుకునే పరిస్థితి. అంతలా ఆయన మాటల్లో మార్పు వచ్చింది అని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.మాటల కోసం కిందా మీదా పడి.. అందరి చేత జోకులు వేయించుకునే స్థితి నుంచి తన మాటలతో నిప్పులు కురిపించే స్థాయికి చంద్రబాబు చేరుకున్నారు.
తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఆయన వదలిన వగ్భాణాలు ప్రజల మనసులను దోచుకున్నాయి. ఇది చూసి తెలుగు తమ్ముళ్లు తెగ సంబరపడిపోతున్నారు.