జనసముద్రం న్యూస్,అనంతపురం,డిసెంబర్ 3: విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించండి
ఘటనకు కారణమైన వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేసిన మంత్రి
అధైర్యపడకండి మీకు అండగా మేమున్నాం – మంత్రి ఉషాశ్రీచరణ్అనంతపురము జిల్లా శింగనమల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం వసతి గృహంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘటనకు విధ్యార్ధులకు వాంతులు అస్వస్థతకు గురై అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినులను మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టి ఘటనపై తక్షణమే విచారణ జరిపి, ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని మంత్రి ఉషాశ్రీచరణ్ జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు