సీఎం జగన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 5 న కర్నూల్ లో రాయలసీమ గర్జన మరియు డిసెంబర్ 7న విజయవాడలో బీసి గర్జన : విజయవంతం చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపు

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 :

●అంబెద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వైఎస్‌ జగన్‌..!

●అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని కోరుకునే గొప్ప మనసున్న వాళ్లం..!

బిసిలను బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌గా పరిగణించడం తప్పు, బ్యాక్‌బోన్‌ క్లాసెస్‌గా సమాజం పరిగణించాలన్నదే జగన్‌మోహన్‌ రెడ్డి గారి ఆలోచనా విధానం అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి గారు స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురంలోని వైసిపి కార్యాలయంలో ఈనెల 5న కర్నూలులో జరగనున్న ‘రాయలసీమ గర్జన’ పోస్టర్లను అనంతపురం ఎంపి తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, పార్టి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బోయ గిరిజమ్మ తదితరులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మా ప్రభుత్వానికి, మా పార్టీకి వెన్నుముకగా బిసిలున్నారనే విధానాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత 40 నెలులుగా అవలంభించిన బిసిల పక్షపాత విధానాం ప్రజలకు తెలుసు. వెనుకబడిన వర్గాల వారిని ముందుకు తీసుకువచ్చి సమ సమాజ స్థాపన చేసినప్పుడే, ఎన్నో బలిదానాలు చేసి సాధించుకున్న స్వాతంత్రానికి ఒక విలువ ఉంటుందని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చెప్పిన విధానాన్ని జగన్‌మోహన్‌రెడ్డి అవలంభిస్తున్నారు. 7న విజయవాడలో జరిగే బీసీ గర్జనను విజయవంతం చేయాలి.

●రాయలసీమ ఆత్మగౌరవ పోరాటంగా, రాయలసీమ వెనుకబాటు తనానికి సంబంధించి అనేక డిమాండ్లతో ఈనెల 5న కర్నూలులో ‘రాయలసీమ గర్జన’ సదస్సు నిర్వహిస్తున్నాం. 70 ఏళ్లుగా అనేక మోసాలకు గురవుతున్న రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాలను రాయలసీమ వేదికగా స్పష్టం చేయాల్సి ఉంది. మేమంతా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే గొప్ప మనసున్న వాళ్లం. రాజధానిలో త్యాగం చేసినవాళ్లం. మా త్యాగాలను చేతగానితనంగా చూడొద్దు. భవిష్యత్‌ తరాల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాయలసీమ ప్రజలందరూ అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతున్నారు. రాష్ట్రంలోని 16 వేల గ్రామాల్లోనూ అభివృద్ధి జరగాలి. రాయలసీమల, అమరావతి, ఉత్తరాంధ్రలోనూ జరగాలి. అందరూ బాగుండాలి అనే వాదనను ఈనెల 5న కర్నూలు జరిగే ‘రాయలసీమ గర్జన’లో వినిపించబోతున్నాం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఇతర మేధావులు, రాయలసీమ వాదులందరూ వేలాదమందిగా తరలివచ్చి విజయవంతం చేయాలని తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం