రాప్తాడు మండలం మండలం బొమ్మేపర్తిలో రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి

Spread the love

జనసముద్రం న్యూస్,రాప్తాడు మండలం:

రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నభూమి కంటే 50 వేల ఎకరాల భూమిని అదనంగా సృష్టించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు ఆరోపించారు. గురువారం రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామం నందు ‘వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకం’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు భూ హక్కు పత్రాలు అందజేశారు. ముందుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…అదనంగా సృష్టించుకున్న 50 వేల ఎకరాలకు సంబంధించిన దాదాపు 15 వేల పాసు పుస్తకాల ద్వారా ఎన్ని వందల కోట్ల రూపాయలు సబ్సిడీలు, ఎన్ని వందల కోట్లు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఉంటారో అర్థం చేసుకోవచ్చు. సెంటుభూమి లేనివాడు కూడా అధికార పార్టీ పక్కన ఉంటే ఎప్పుడైనా లక్షాధికారే. అప్పుడంతా దొరలపాలన సాగింది. గొందిరెడ్డిపల్లి నల్లగుట్ట, పాలచెర్ల కొండ, గొల్లపల్లి గుట్ట ఇవన్నీ ఆన్‌లైన్‌లో ఎక్కించారు. దుర్మార్గమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు.

1928లో డైక్లాయిడ్‌ అనే బ్రిటీష్‌ వ్యక్తి సర్వే చేయించారు. ఆ తర్వాత అనేక లావాదేవీలు జరిగాయి. ఆయా సర్వే నంబర్లలోని భూములకు సంబంధించిన రైతుల వారసులు, వారి వారసులు వచ్చారు. అనేక సబ్‌డివిజన్‌లు జరిగాయి. పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. 2012లో ఆన్‌లైన్‌ వ్యవస్థ వచ్చింది. ఆన్‌లైన్‌లో ఈ పాస్‌ బుక్కులు ఇచ్చారు. ప్రతి రైతు భూముల వివరాలు సర్వే నంబర్లు వారీగా రైతు పేరు, ఎన్ని ఎకరాలు, భూమి వివరాలు ఆన్‌లైన్‌లో పొందు పరిచారు. ఆన్‌లైన్‌లో ఈరోజు ఉన్న భూములు రేపు ఉంటాయో లేదో తెలీదు. ఎందుకంటే డిజిటల్‌ ‘కీ’ తహశీల్దార్‌ వద్ద ఉంటుంది. ఎవరైనా ప్రజాప్రతినిధులు ఫోన్లు చేసి చెబితే ఆన్‌లైన్‌లో భమూలు మారిపోయే పరిస్థితి ఉండేది. పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో అదే జరిగింది. రాప్తాడు మండలానికి ధర్మవరపు మురళీ అనే వ్యక్తి అనధికార మంత్రిగా ఉండేవారు. వారు ఎక్కడో గెస్ట్‌హౌస్‌లో కూర్చుని డిజిటల్‌ కీ తెప్పించుకుని ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి ఎవరెవరికి ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వాలి, ఎవరెవరికి పంటల బీమా ఇవ్వాలి అనేది వారే చేసేవారు. ఇష్టారాజ్యంగా వంకలు, వాగులు, గుట్టలు, గుడులు, బడులు, స్మశానాలు, గ్రామకంఠాలు ఇలా ఏవి పడితే అవి పాస్‌బుక్కులు చేసుకున్నారు. 100 ఎకరాల ఉన్న సర్వే నంబరులో 300 ఎకరాలు కూడా చేసుకున్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చిన తర్వాత గత పాలకుల మాదిరే మనమూ అనుభవిద్దామని అనుకోలేదు. రైతు అనే వాడు రైతే. వ్యవసాయం చేసే వాడు రైతు. పదిమందికి అన్నం పెట్టేవాడు రైతు. ఏ పార్టీకి, కులానికి, మతానికి సంబం«ధించిన వాడైనా రైతుకళ్లల్లో ఆనందం నింపాలి అని జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచించారు. రైతు ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవాలని భావించారు. అందులో భాగంగానే ఈరోజు రైతులకు భరోసా కల్పిస్తూ ఊర్లలోకే విత్తనాలు, ఎరువులు పంపించాడు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాడు.

భూమి ఎవరి పేరు మీద ఉంటుందో…ఎవరైతేసాగులో ఉన్నారో వారికే శాశ్వతంగా హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రైతుకు, ప్రతి వ్యక్తికి తన ఆస్తి, భూమిపై మమకారం ఉంటుంది. మా భూములు మాతోనే ఉండాలి మా తర్వాత మాపిల్లలకు∙హక్కులు రావాలి అందుకు ఎలాంటి అడ్డుంకులు ఉండకూడదని కోరుకుంటారు. భూహక్కు పత్రాలు పొందిన రైతులు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చు. అత్యాదునిక పరికరాల ద్వారా భూములను సర్వే చేయిస్తున్నారు. ఇందుకోసం వందల కోట్లు ఖర్చు చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు..

  • Related Posts

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    Spread the love

    Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    Spread the love

    Spread the love జనసముద్రం న్యూస్, ఏపీ, డిసెంబర్ 12. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి 17న ఫస్ట్ లాంగ్వేజ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు