జనసముద్రం న్యూస్, డిసెంబర్ 1 :
షాద్ నగర్ : గంజాయ్ చాక్లెట్స్ అమ్ముతున్న ముఠాను షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. షాద్ నగర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నాగులపల్లి రైతు కాలనీ మినీ చౌరస్తా వద్ద ఓ కిరాణా షాపులో గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు రాత్రి చాకచక్యంగా అరెస్ట్ చేశారు. 480 గంజాయి చాక్లెట్స్ ప్యాకెట్లను స్వాధీన పరుచుకొని వారిని విచారించారు. ఈ విచారణలో భాగంగా నందిగామ వద్ద అయ్యప్ప దేవాలయం కిరాణం షాపులో 40 గంజాయి చాక్లెట్స్ ఉన్నాయన్న సమాచారం తెలుసుకొని వాటిని కూడా స్వాధీనపరుచుకున్నారు. కాటేదాన్ నుండి ఈ గంజాయి చాక్లెట్స్ రవాణా అవుతున్నట్లు ఎక్సైజ్ సీఐ రామకృష్ణ తెలిపారు. కాటేదాన్ కు చెందిన వ్యక్తితో పాటు షాద్ నగర్ లో మరికొందరు అదుపులో తీసుకుని రిమాండ్ కు పంపినట్టు తెలిపారు. సుశీల్, శశికాంత్, జలంధర్, అజయ్ కుమార్ నలుగురిని గురువారం రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ రామకృష్ణ స్పష్టం చేశారు..