●దాదాపు 150 హత్యలు జరిగాయి..!
●1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వమే ఈ హత్యలు చేయించింది..!
●తెలుగుదేశంలో ఉన్నాకూడా మా చందు అన్నను పరిటాల రవీంద్ర హత్య చేయించాలని చూశాడు..!
●పరిటాల సునిత గెలవలేదనే నన్ను టార్గెట్ చేశారు..!
●తన భర్తను చంపిన వాళ్లతో లాలూచి పడి నన్ను ఓడించింది..!
●చంద్రబాబు కళ్లార్పకుండా అపద్ధాలు చెబితే అది నిజమని వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు..!
●డిసెంబరు 21లోగా నియోజకవర్గంలో 10 సభలు ఏర్పాటు చేస్తాం..!
●మేం చేసిన అభివృద్ధి, 2019 వరకు 25 ఏళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్న పరిటాల కుటుంబం చేసిన అభివృద్ధిని ప్రజలనే అడుగుతాం..!
1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయకత్వంలో నిస్సిగ్గుగా, పోలీసు అధికారులు చంద్రబాబు ఆదేశాలతో పరిటాల రవీంద్రను ప్రోత్సహించారు. అనంతపురం జిల్లాలో పరిటాల రవీంద్రను ఎదురించినవారిపై 45 ఎన్‌కౌంటర్లు జరిగాయి. దాదాపు 150 హత్యలు జరిగాయి. ఎక్కడా ఒక కేసుకు కూడా శిక్ష పడలేదు. అప్పటి ప్రభుత్వమే ఈ హత్యలు చేయించిందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు ఆరోపించారు. బుధవారం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఎమ్మెల్యే గారు ఏడిసిసి బ్యాంకు మాజీ చైర్మన్ బోయ వీరాంజనేయులు, అనంతపురం రూరల్ జెడ్పిటిసి చంద్రకుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. శాశ్వత శాంతిస్థాపన కోసం రక్తపాతం తప్పుకాదు అని నారాయణ అనే ఓ కమ్యూనిస్టు మాట్లాడితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని హైలెట్ చేసింది. మేము చంపడం తప్పుకాదు అని ఈనాడు పత్రికలో రాయించుకున్నారు. వారి దుర్మార్గారాలను ఎదుర్కోవాలని ఎంతోమంది యువకులు ఆరోజుల్లో నక్సలిజంలో చేరి ఎన్‌కౌంటర్ అయ్యారు. తన చుట్టూ ఉన్నవాళ్లను సైతం అనుమానించి రవీంద్ర హత్యలు చేయించాడు. ఇన్ని హత్యలు చేయిస్తే కూడా ఎందుకు శిక్ష పడలేదు. ఎవరు కాపాడారు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి. ఎందుకు పరిటాల రవీంద్రను ఎదురించిన వాళ్లు ఊళ్లొదిలారు.
●నాలుగు రోజుల కింద మా సోదరుడు మాట్లాడిన మాటలకు నేను వివరణ ఇచ్చా..!
నాకు ప్రాణహాని తలపెడతారేమోననే బాధతో మా సోదరుడు మాట్లాడిఉండొచ్చు. చంద్రబాబు నాయకత్వంలో జరిగిన హత్యాకాండను మా సోదరుడు చూశాడు. పరిటాల రవీంద్రను ముందర పెట్టుకుని సూడోనక్సల్స్ సంస్థతో నడిపించిన ప్రభుత్వాన్ని చూశాడు మా సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి. ఆరోజుల్లో తెలుగు యువత అనంతపురం అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన తెలుగుదేశంలో ఉన్నాకూడా పరిటాల రవీంద్ర హత్య చేయించాలని చూశాడు. నాదగ్గరకు వచ్చి మీ అన్నను చంపమని పరిటాల రవి చెప్పాడని చెప్పిన వాళ్లకు నేను ఆశ్రయం కల్పిస్తే వాళ్లను తీసుకెళ్లి పరిటాల రవీంద్ర ఎన్‌కౌంటర్ చేయించాడు. ఎంతోమందిని తన హత్యాకాండకు వాడుకున్నాడు. మళ్లీ వాళ్లనే పోలీసులతో ఎన్‌కౌంటర్ చేయించాడు.
●పీపుల్స్‌వార్ పార్టీని వాడుకున్నాడు..!
తాను పీపుల్స్‌వార్ పార్టీ సానుభూతిపరుల కుటుంబానికి చెందినవాడనని చెప్పుకున్నాడు. ప్రజల్లో సానుభూతిని సంపాదించుకునేందుకు ప్రయత్నం చేశాడు. పరిటాల రవీంద్ర దుర్మార్గుడు ఇతడు ప్రజా కంఠకుడు, ఇతను ప్రజల మానప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నాడని హతమార్చుతామని పీపుల్స్ వార్ పార్టీ బహిరంగ ప్రకటన చేసింది. పరిటాల రవి 150 ఎకరాల ఎస్టేట్‌ను ఏర్పాటు చేసుకుని పెంచిన గంధం, ఎర్రచందనం చెట్లను పీపుల్స్‌వార్ పార్టీ సభ్యులు నరికేశారు. పరిటాల సునిత చిన్నాన్న సరెండర్ అయిపోయి తన గన్‌మెన్ల వద్ద ఉన్న గన్లను అప్పగించిన సందర్భం ఉంది.
పేదలకు అన్నం పెట్టారు, ఆశ్రయం కల్పించారు, రోడ్లు వేశారు, ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా ఎన్నో సేవలు చేశారని తప్పుడు కూతలు చెప్పుకుంటున్నారో అవన్నీ నిజమైతే పీపుల్స్‌వార్ పార్టీ ఎందుకు వీరిని టార్గెట్ చేసింది. పీపుల్స్‌వార్ పార్టీకి చెందిన నాయకులను ఎన్‌కౌంటర్ చేయించారు. సత్యమన్న, గంగన్న లాంటి నిజమైన కమ్యూనిస్టులను ఎన్‌కౌంటర్ చేయించారు. ఆ పార్టీలో హైకమాండ్‌లో ఉన్నవారికి డబ్బులిచ్చి, ఆయుధాలిచ్చి వారిని మచ్చిక చేసుకుని సర్వైవ్ అయిన వ్యక్తి పరిటాల రవీంద్ర. మద్దెలచెర్వు సూరి తల్లిని, అక్కను, సోదరుడిని, తండ్రిని చంపాడు కాబట్టే సూరి పగ సాధించాడు. సూరి అయినా, రవి అయినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పే.
పరిటాల సునితకు ఎంతటి నటనా చాతుర్యం ఉందో రామగిరి మండలం వెంకటాపురంలో అడిగితే చెబుతారు. 2014 ఎన్నికల్లో ఆమె కుమారుడు అందరికీ ఫోన్లు చేసి మీరు సైలెంట్‌గా ఉండాలి..లేదంటే మాగురించి మీకు తెలుసు కదా? అని మాట్లాడాడు. కొత్తగా వచ్చాడు కదా వీడేమో పీకుతాడు అని చాలామంది భయపడి సైలెంట్ అయ్యారు. గెలిచిన తర్వాత ఆమెకు సివిల్ సఫ్లయ్ మినిస్టర్ ఇచ్చారు బాగానే సంపాదించుకుంది. తర్వాత స్రీశిశు సంక్షేమశాఖ ఇచ్చారు అందులోనూ బాగా సంపాదించుకుంది. ఆక్రమంలో నలుగురిని మా పార్టీ నాయకులను హత్య చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి, పరిటాల సునీత మంత్రి గతంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రి పరిటాల రవీంద్ర మంత్రి. ఈ ఇద్దరి కాంబినేషన్ ఉన్నప్పుడు జిల్లాలో హత్యలు జరిగాయి.
తగరకుంట కొండారెడ్డి హత్యకేసు నిందితులకు శిక్ష పడే అవకాశాలు కనిపించడం, అందులో పరిటాల సునిత తమ్ముడు, చిన్నాన్న ప్రధాన ముద్దాయిలుగా ఉండడం వారికి కూడా శిక్ష పడుతుందని భావించే పరిటాల శ్రీరామ్… తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గడప గడప తిరుగున్నావ్ కొండారెడ్డి హత్య కేసు ముద్దాయిలు నిన్నేమైనా చేస్తే మాకు సంబంధం లేదు, రాబోయే రోజుల్లో మీ కుటుంబ సభ్యులు పొర్లిపొర్లి ఏడ్చే పరిస్థితి వస్తాది, మేమెందుకు పరిటాల కుటుంబంతో పెట్టుకున్నామా…అని మీరు భావించే పరిస్థితి వస్తాదని వాడు మాట్లాడతాడు. దీన్నేమంటారు ప్రజాస్వామ్యం ఉందా? లేదా?. కోర్టు ఒక కేసును విచారిస్తుంటే ఈకేసులో సాక్షులు సాక్ష్యం చెబుతుంటే వందమందిని తీసుకుపోయి సాక్షులను బెదిరించే వాతావరణం కల్పించింది పరిటాల శ్రీరామ్.
కట్టేసి కొడతాం, తలకాయలు పగలకొడతాం, ఒకరికి పదిమంది ఇలా మాట్లాడుతున్నాడంటే ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ప్రతిసారి మళ్లీ మేము అధికారంలోకి వస్తామంటూ ఐఏఎస్, పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. చంద్రబాబు కళ్లార్పకుండా అపద్ధాలు చెబితే అది నిజమని వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు.
టెక్స్‌టైల్స్ పాలసీలో సబ్సిడీలు ప్రకటించాక అవి అమలు కావాలంటే ఆపరేషన్ గైడ్‌లెన్స్ ఇవ్వాలి. మరి ఈ కారణంగానో చంద్రబాబు మళ్లీ రాడు ఎందుకొచ్చిన తలనొప్పి అని భావించారో ఏమోకానీ ఫేజ్ కంపెనీ ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. జాకీ అనే ఫ్యాక్టరీ కాగితం మీద తప్ప ఒక ఇటుక కూడా వేయలేదు. కానీ వచ్చింది…పోయింది అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 2018లో కాంపౌండ్ పనులు చేపట్టి మధ్యలోనే ఆపేసి తమిళనాడు సేలంకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సాక్షి పత్రిక 2018 డిసెంబరు 26న కథనం కూడా రాసింది. జాకీ వెళ్లిపోయిందంటూ 2020లో ఎబిఎన్ టివి చానెల్ చూపించింది. 2022లో ఈటివి, టివి–5 చూపించింది. మరి 2024లో ఏ టివి చూపిస్తుందో. 2018 పాలసీలకు ఆపరేషన్ గైడ్‌లెన్స్ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎందుకంటే దోచిపెట్టే విధానం మాప్రభుత్వంలో లేదు. 2018 నుంచి ఇప్పటిదాకా గార్మెంట్ ఫ్యాక్టరీలు రాష్ట్రంలోకి రాలేదు. అలాంటిది నేను తరిమేశానని తప్పుడు కూతలు కూస్తారా?. కొంచెమన్నా సెన్స్ ఉండాలి కదా? ఇవన్నీ తెలిసి నడిపించిన పెద్దమనిషి చంద్రబాబు తప్పుడు కూతలు కూస్తే ఆయన వయసుకైనా బుద్ది జ్ఞానం ఉండొద్దా?.
ఒక పరిశ్రమను ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. నేనేమైనా ఇండస్ట్రియల్ మినిస్టర్‌నా. ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే ప్రభుత్వం చేస్తుంది. మహా అయితే ఎమ్మెల్యే ప్రపోజ్ చేయొచ్చు. ఈ ప్రకారం నేను 20 ప్రపోజల్స్ పంపాను. ప్రభుత్వంపై మాట్లాడితే రాష్ట్ర అధికారులు వివరణ ఇస్తారు.
ఈ జిల్లాలో మీరు క్రైం చేయాలనుకుంటున్నారు. అందుకోసం పరిటాల సునితను ప్రమోట్ చేస్తున్నారు. ఆమె గెలిచే పరిస్థితి లేదు కాబట్టే నన్ను టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే వ్యక్తిత్వాన్నిహరించే మాటలు మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు నన్ను రామగిరి మండలంలోకి రానించలేదు. అయినా ఎక్కడా సంయమనం కోల్పోలేదు. 2014 నుంచి 2019 వరకు మా నాయకులను హత్యలు చేస్తే మేమెక్కడా ప్రతిదాడులు చేయలేదే? మా ఆస్తులను అమ్ముకునేలా చేసినా, మా వ్యాపారాలు దెబ్బతీసినా, మా గన్‌మెన్లను ఉపసంహరించినా, 2009లో నన్ను అక్రమంగా అరెస్ట్ చేయించినా, తన భర్తను చంపిన వాళ్లతో లాలూచి పడి నన్ను ఓడించినా నేనెక్కడా సంయమనం కోల్పోలేదు. ప్రజల వద్దకే వెళ్లాను.
●డిసెంబరు 21లోగా 10 సభలు..!
తోపుదుర్తి మహిళా సహకార డెయిరీలో మహిళా పాడి రైతులకు సభ్యత్వం ఇస్తాం. మేం నిర్మిస్తున్న 20 వేల ఇళ్లల్లో లబ్ధిదారులెవరైనా వచ్చి అడిగితే తామే నిర్మించి ఇస్తాం. వ్యవసాయ బోరు లేని 6వేలమంది పేద రైతులకు ఉచితంగా బోర్లు వేస్తున్నాం. అర్హులైన వారిని డిసెంబరు 21లోగా నియోజకవర్గంలో 10 సభలు ఏర్పాటు చేసి రిజిష్ట్రేషన్లు చేసుకుంటాం. ఆ సందర్భంలో మేం చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తాం. అలాగే 2019 వరకు 25 ఏళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్న పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేశారో ప్రజలను అడగబోతున్నాం. 2019 తర్వాత పేరూరు డ్యాంకు మేము నీళ్లు తీసుకురావడం చారిత్రాత్మకం. రామగిరి బంగారు గనులు తెరిచేందుకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. అన్ని చెరువులకూ నీళ్లిచ్చాం. రూ. 69 కోట్లతో జల్‌జీవన్ కింద తాగునీటి స్కీంను మంజూరు చేయించాం. మూడు రిజర్వాయర్లను మంజూరు చేయించాం. దీనికి సంబంధించి భూ సేకరణ పనులు కూడా పూర్తయ్యాయి. ఇవన్నీ వివరిస్తూ డిసెంబరు 21 పాల డెయిరీని ప్రారంభిస్తూ అదే ప్రాంగణంలో గార్మెంట్ పరిశ్రమకు భూమిపూజ కూడా చేయబోతున్నాం. ఈ పరిశ్రమలో పని చేయాలనుకునే మహిళల పేర్లను ఆరోజు ఉదయం రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మేము చేస్తున్నది చెప్పబోతున్నాం, చేయబోయేది చెప్పబోతున్నాం.
ఒక మహిళ అని కూడా చూడకుండా మా తల్లిని ఆమె తిట్టించిందో అనరాని మాటలతో దూషించిందో, మా మనసు గాయపడేలా ప్రవర్తించిందో అదికూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. అలాగే చంద్రబాబు గారి మేకవన్నె పులి నైజం, ఆయన వెనుకండి నడినిస్తున్న వైనాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తాం.
చంద్రబాబు ఏమైనా మాట్లాడొచ్చు. మామను చంపిన సులభం కాదు ప్రజాస్వామాన్ని ఖూని చేయడం. మామ కాబట్టి నమ్మి మోసపోయాడు. ప్రజలు నిన్ను నమ్మరు బాబు నమ్మరు. మా రాష్ట్రానికి పట్టిన ఖర్మ ఇదేంరా. చంద్రబాబును ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నేళ్లు చూడాలని ప్రజలు భావిస్తున్నారు. కనీసం ఆ స్థానంలో రేపోమాపో పవన్ కళ్యాణ్ వచ్చినా బాగుండేదని ప్రజలు కోరుకుంటున్నారు. తాటాకు చప్పళ్లు అంటున్నావు నిన్ను ఎవరూ బెదిరించడం లేదు. కాటికి కాళ్లు చాపినావు, వయసు అయిపోయి వచ్చింది. ఉన్నకాలం నువ్వు చేసిందేమీ లేదు రాష్ట్రానికి. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని కాగ్ నివేదిక ఇచ్చింది. నీ విషస్వరూపం, నిజస్వరూపం, నేర సామ్రాజ్య పరిపాలన గురించి కూడా రాష్ట్ర ప్రజలకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాం. అనంతపురం జిల్లాలో రక్తపాతం ఏవిధంగా జరిగిందో, ఏ విధంగా మందుపాతరలు, టివి బాంబులు రాజ్యమేలాయో, కేసులు శిక్షలు పడకుండా ఏవిధంగా వందల హత్యలు చేశారో తెలియజేస్తాం.
కాటికి కాళ్లు చాపిన చంద్రబాబు గురించి మరోవిధంగా ఆలోచించడం రాష్ట్రంలో దిక్కుమాలిన వాడికి ఉండదు. చంద్రబాబు అనే వ్యక్తి సారథ్యంలో 1987లో బొక్సంపల్లిలో మందుపాతరలు పెట్టి గడ్డం పుల్లన్నను చంపినప్పటి నుంచి పరిటాల రవి, చంద్రబాబు ఇద్దరూ కలిసి రచించిన పథకాల్లో భాగంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని అనంతపురం జిల్లాలో ఆధిపత్యం కోసం అనేక హింసా సంఘటనలు జరిగాయి. అనామకుడైన పరిటాల రవిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి, ఆయనకున్న నేర ప్రవృత్తిని గమనించిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని గండికొట్టొచ్చని భావించారు. ఇందులో భాంగానే రవీంద్రకు రాజకీయ పట్టాభిషేకం చేశారు. మద్దెలచెరువు సూరి ఇంట్లో టివి బాంబు పెట్టి సూరి కుటుంబ సభ్యులు, కురుబ శరవన్న కుటుంబ సభ్యులను హతమార్చారు. డబ్బుకోసం, ఆధిపత్యం కోసం పని చేసేటువంటి వారితో సూడో నక్సలైట్లను ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకత్వాన్ని హతం చేయడం, ఖతం చేయాలనే అజెండా అమలు చేశారు. పరిటాల రవీంద్రను ముందు పెట్టి హత్యలు చేయించిన చరిత్ర ఈ తరం వారికి తెలీదు. నేను మైక్రోసాఫ్ట్‌ను తెచ్చాను, సెల్‌ఫోన్‌ను కనిపెట్టాను, హైదరాబాద్ నగరాన్ని నిర్మించాను అని చంద్రబాబు చెప్పే అపద్దాలు ఈతరం వారికి తెలీదు. నమ్మిన వాళ్లను వంచించే నయవంచకుడు చంద్రబాబు అని ఆతరం వారికి తెలుసు.