జనసముద్రం న్యూస్,అల్లిపురం,విశాఖపట్నం,.., నవంబర్ 30:
పదివేల మందికి చీరలు పంపిణీ
కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, 32 వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు సేవల్లో ఎంతో మంది కి ఆదర్శ ప్రాయుడని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్ నాద్ కొనియాడారు.. బుధ వారం అల్లిపురం లోని తన నివాసములో
కే ఎన్ అర్ చారిటబుల్ ట్రస్టు 28 వ వార్షికోత్సవ వేడుకలు,పుట్టినరోజు వేడుకలు సంయుక్తంగా ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి
భారీ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ముఖ్య అతిధిగా పాల్గొని కందుల నాగరాజు కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి ఆదర అభిమానాలు పొందారని, కందుల కల కాలం ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.ప్రభుత్వ కార్య క్రమాలతో పాటు తన సొంత నిధులతో యెన్నో అద్భుతమైన
సేవలు అందిస్తున్న కందుల ఆదర్శ ప్రాయుడన్నారు నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి మాట్లడుతూ కందుల విశాఖలోనే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు అలాగే వార్డు అభివృద్ధి కి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.సింహాచలం దేవస్థానం ధర్మ కర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు కందుల కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సింహాద్రి నాధుడు జ్ఞాపిక బహోక రించారు.మూడు దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బ్లాడ్ క్యాంప్ లు, మెడికల్ క్యాంప్ లు, కరోనా లో సైతం ఎవరికీ ఏ కష్టం వచ్చిన అందరిని ఆదుకోవడం లో ముందు వరసలో కందుల నిలిచారన్నారు.
అనంతరం కందుల నాగరాజు, నళిని దంపతులను వీరంతా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, మాజీ శాసన సభ్యులు, కార్పొరేటర్ లు, వార్డ్ నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.అన్నదానం.. వస్త్ర దానం చేశారు.10 వేల మంది కి చీరలు పంపిణీ చేశారు. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.