- వాయువు కాలుష్యానికి గురై ఒక నెలలోనే ఐదుగురు మృతి…
- ఏ ఒక్క నాయకుడికి అధికారికి కానరాదా గ్రామ ప్రజల బాధ..!
- మంచులాగా కమ్ముకుంటున్న పొగలు…
- గాలి పీల్చాలన్న భయపడుతున్న గ్రామస్తులు…
జన సముద్రం న్యూస్ అనంతగిరి:
ఒకప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించినోళ్లు. ఇప్పుడు ఆ గ్రామంలోనే ఉండాలంటే మృత్యు భయంతో వణికి పోతున్నారు.
రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. కష్టం చేస్తే గాని కానరాని డబ్బులు.బుక్కెడు బువ్వా కోసం కాయ కష్టం చేసి జీవనం గడిపేటోళ్లు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల శాపంగా మారింది.వివరాల్లోకి వెళితే…అనంతగిరి మండలపరిదిలోని వెంకట్రాంపురం గ్రామం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ ను తీసేయాలని పలుమార్లు అధికారులకు నాయకులకు చెప్పిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కోదాడ పట్టణంలోని వ్యర్ధపదార్థాలని వెంకట్రాంపురం గ్రామం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ లో వేసి సాయంత్రం వేళల్లో కాలుస్తున్నారు.కాలుస్తున్న పొగ గ్రామ ప్రజలకు రాత్రి సమయంలో పొగ కలుషితమైన గాలి ఊపిరి ఆడకుండా.అనారోగ్యానికి గురి చేస్తుందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. పర్యావరణ కాలుష్యం వల్ల ఒక నెలలోనే ఐదుగురు,ఆరుగురు మృతి చెందుతున్నారు.మంచులాగా పొగ ఊరుని కమ్ముకుంటున్నాయి.స్వచ్ఛమైన గాలి లేదు. స్వచ్ఛమైన నీరు లేదు.అంత పర్యావరణానికి కలుషితమై రోజురోజుకు ప్రజల ఆరోగ్యం క్షీణించిపోతుందని ప్రజలు అగ్రహ వ్యక్తం చేస్తున్నారు.
డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుంచి తరలించమంటే ఏ ఒక్కరు అధికారి కానీ రాజకీయ నాయకులు కానీ ముందుకు రావడం లేదు. పొగ వాసన పీల్చలేక రోజు నరకయాతన చూస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ఒకప్పుడు ప్రశాంతమైన వాతావరణం నడుమ ఆహ్లాదకరమైన జీవితాన్ని గడిపేది కానీ డంపింగ్ యార్డ్ ఏర్పడినప్పటి నుండి గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురి కావడం ఏదో ఒక రకమైన వ్యాధులను భరిస్తూ దవాఖానాలకు వెళ్లడం జరుగుతుంది. ఊరును నాశనం చేయడానికే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను కాపాడవలసిన నాయకులు అధికారులే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గ్రామ ప్రజలు మండిపడ్డారు.
గ్రామస్తులు అధికారులకు నాయకులకు విన్నవించుకున్న పట్టించుకునే నాధుడే లేడు… గ్రామస్తులు కృష్ణ
విషపూరితమైన గాలిని పిలుస్తూ ఒక నెలలోనే ఐదుగురు ఆరుగురు మృతి చెందడం జరుగుతుంది. డంపింగ్ యార్డ్ లో నుంచి వెలువడే పొగ వల్ల చిన్న పిల్లలు,వృద్దులు అనారోగ్యానికి గురవుతున్నారు. త్రాగే నీరులో పీల్చే గాలిలో కలుషితమై వాయువు ఏర్పడి ప్రాణం పోయే స్థితికి వస్తుంది. ఈ డంపింగ్ యార్డ్ మా ఊరికి ఒక శాపంగా మారిందని ఆన్నారు.