జన సముద్రం న్యూస్ బయ్యారం: ప్రతినిధి (పసుపులేటి సతీష్ ): మండలంలోని చెరువు ముందు కొత్తగూడెం గ్రామంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు . వైద్య శిబిరానికి నిపుణులైన డాక్టర్లచే చుట్టు పక్కల గ్రామాల వారికి కోట గడ్డ , కోయగూడెం, లింగగిరి, కస్తూరినగరం తదితర గ్రామాలలో వారికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ పాల్గొని మాట్లాడుతూ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి , అందరు ఆరోగ్యం గాఉన్నప్పుడే సమాజం బాగుటుందని అన్నారు . ఈ కార్యక్రమంను ఏర్పాటు చేసిన బయ్యారం సిఐ బాలాజి , ఎస్ ఐ రమాదేవిని అబినందించారు . 1200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు,మందుల పంపిణీ చేసినట్లు తెలిపారు.మావోయిస్టులను గ్రామంలోకి రానివ్వకండు ఉండాలి ఒక వేళ కనబడితే . వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు .అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగింని గుర్తు చేశారు .మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం,అభివృద్ధి కొరకే జిల్లా పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలియచేశారు.అర్ధరాత్రి సమయాల్లో గ్రామాల్లోకి వచ్చి మావోయిస్టులు అమాయకపు ఆదివాసి గిరిజనులను బయబ్రంతులను గురిచేస్తూ , ప్రాణాలు తీయడం క్రూరమైన చర్య అన్నారు.ప్రజలు ఎవరు కూడా వాళ్ళను నమ్మరని అన్నారు .గ్రామాల్లోని యువత బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో చేరి,ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని,తమ గ్రామానికి,జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం అక్కడ పాల్గొన్న ప్రజల గ్రామాల్లోని సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన బయ్యారం పోలీసులను ఇతర సిబ్బందిని డాక్టర్లను మండల అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పి వైద్య శిభిరం ఏర్పాటు సందర్బంగా బయ్యారం ఏ.జెన్సీ ప్రాంతంలో స్పెషల్ పార్టి పోలీసులు గట్టి బందో బస్తు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో డి ఎస్పి సదయ్య, సిఐ లు ఎస్ లు , జిల్లా డిఎమ్ హెచ్ ఓ హరీష్ రాజ్ , సూపరిడెంట్ వెంకట్రాములు , వైద్యులు వీరన్న, రాజకుమార్ , సర్పంచ్ , తదితరులు పాల్గొన్నారు
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…