

విమానంలో కూర్చోవాలని..అందులో డిన్నర్, లంచ్ చేయాలని..ఫ్లైట్ కూర్చొని ప్రకృతిలోని అందాలను చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కాని ఆ కోరిక తీర్చుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే డిసెంబర్ నెల నుంచి అతి తక్కువ ఖర్చుతోనే ఈ సౌకర్యం, లగ్జరీ ఫీలింగ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. పిస్తా హౌస్ రెస్టారెంట్ నిర్వాహకులు ఎయిర్‌బస్-320ని కొనుగోలు చేసి దాన్ని ఫ్లైట్ రెస్టారెంట్‌గా హైదరాబాద్‌శివారు ప్రాంతమైన శామీర్‌పేటలో ఏర్పాటు చేస్తున్నారు. జంటనగరాల ప్రజలకు బ్రాండ్ నేమ్‌తో ఉన్న బిర్యానీతో పాటు ఫ్లైట్ అనుభూతిని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.