బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించ్చిన కురుబ కుటుంబ సభ్యులు.
జనసముద్రం న్యూస్:నవంబర్ 26,శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్:
పుట్టపర్తి న్యూస్: శ్రీ సత్యసాయి జిల్లా,పుట్టపర్తి నియోజకవర్గం సాయి ఆరామం నందు ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కురువ కుటుంబ సభ్యులు అలాగే సవితమ్మ మాట్లాడుతూ…భారతావనికి ఎందరో మహాత్ములు,గొప్ప వ్యక్తుల త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది.అదేవిధంగా దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం పుట్టిన నవంబర్ 26ని గుర్తు పెట్టుకోవాలని 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్.ఎమ్.సింఘ్వికి ఆలోచన వచ్చింది.అదే రోజును న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు.అయితే,భారత ప్రభుత్వం 2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి,ఆ సంవత్సరం నవంబరు 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది.అప్పటి నుంచి నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా,రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారధిగా కమిటీ ఏర్పాటైందని,రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ భిన్నత్వ సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు.కమిటీలోని ఆరుగురు సభ్యులు మేథోమధనం నిర్వహించి కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు.1947 నవంబర్ 26న అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదించిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సామకోటి ఆదినారాయణ,మల్లికార్జున,రామాంజినేయులు,నాగేంద్ర,ఏ ప్రసాద్,చెన్నప్పా,శివానంద,కమ్మన్న,అంగడి ప్రభాకర్,పైపల్లి చంద్రశేఖర్,గోరంట్ల కిష్టప్ప,నారాయణస్వామి,రమేష్,కేశినేని ఆదినారాయణ,గొరంట్లపల్లి శ్రీనివాసులు తదితరులు కురుబ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.