జనసముద్రం న్యూస్:నవంబర్26, శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్:
నల్లమాడ,ఓడిసి న్యూస్: మండలం రెడ్డిపల్లికి చెందిన గంగులప్ప ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని వారి నివాసంలో ఆయనను పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.అనంతరం వైద్య సహాయం నిమిత్తం ఆర్ధిక సాయం అందించారు.నల్లమాడ మండలం ఏర్రవంక పల్లికి చెందిన బాలాజీ,ఉమాశంకర్ కుటుంబాలను పరామర్శించారు.వారిని పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని ఆర్థికసాయం అందించారు.పోలేటి వారి పల్లికి చెందిన కురబ నారాయణప్ప కాలు ఆపరేషన్ వివరాలు తెలుసుకొని పరామర్శించారు,వైద్య ఖర్చులు నిమిత్తం రూ.3000 ఆర్థికసాయం అందించారు.పాత బత్తల పల్లె మాజీ సర్పంచ్ గోవింద్ రెడ్డి యోగక్షేమాలు తెలుసుకున్నారు.ఎనుములవారి పల్లెకు చెందిన సుబ్బయ్యను పరామర్శించి ఆర్ధిక సాయం చేశారు.ఓడిసి మండలం ఎం.కొత్తపల్లికి చెందిన ఆనే అరుణ్ కుమార్ ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని నేడు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.వారి నుంచి వివరాలు తెలుసుకొని,దైర్యంగా ఉండాలని పేర్కొన్నారు.అనంతరం వారికి రూ.5000 ఆర్థికసాయం అందించారు.ఇదే గ్రామానికి చెందిన ఎల్లమ్మకు కాలు ఆపరేషన్ విషయం తెలిసి పరామర్శించి ఆర్థికసాయం అందించారు.ఓడిసి మండల కేంద్రంలో ఇటీవల కిడ్నీ ఆపరేషన్ జరిగిన సునీల్ ను పరామర్శించారు,ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.అనంతరం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న రామ లక్ష్మమ్మ ఆరోగ్య వివరాలు తెలుసుకొని రూ.3000 ఆర్థికసాయం చేశారు.ఓడిసి మండల కేంద్రానికి చెందిన సరోజమ్మ ఇటీవల మరణించిన విషయం తెలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.కుమార్తె అనిత ద్వారా కుటుంబ వివరాలు తెలుసుకొని ఆర్థికసాయం అందించారు.