ప్రపంచంలో ఎక్కడా జరగని వింతలన్నీ మనదేశంలోనే జరుగుతున్నట్టు ఉన్నాయి. అలాంటి వింత ఘటనే హరియాణాలోని చీడి గ్రామంలో జరిగింది. అక్కడ కొద్ది రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ధర్మపాల్ దలాల అలియాస్ కాలా అనే అభ్యర్థి సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. 66 ఓట్ల తేడాతో నవీన్ దలాల్ అనే అభ్యర్థి గెలుపొందారు.
ఈ నేపథ్యంలో ప్రశాంతతకు చిహ్నమైన తమ గ్రామంలో ఎలాంటి గొడవలు ఉండకూడదనే ఉద్దేశంతో ఆ గ్రామ ప్రజలు ఎవరూ ఊహించని పని చేశారు. పంచాయతీ సర్పంచ్గా ఓడిపోయిన ధర్మపాల్ దలాలకు రూ.2 కోట్ల నగదు పోగు చేసి ఇచ్చారు. అంతేకాకుండా ఆయనకు ఒక కారును కూడా గిఫ్టుగా అందించడం విశేషం.
గ్రామంలో ప్రజల మధ్య ఎలాంటి ద్వేషాలు రాజకీయ శత్రుత్వం ఉండకూడదనే తాము ఆయనకు రూ.2 కోట్ల నగదు కారు గిఫ్టుగా ఇచ్చామని చీడి గ్రామస్తులు చెబుతుండటం విశేషం. మరోవైపు గ్రామస్తుల వినూత్న చర్యతో పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ధర్మపాల్ ఆశ్చర్యానికి గురయ్యాడు. తాను సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయి బాధలో ఉన్నప్పడు గ్రామస్తులు తనపై చూపిన అభిమానం చూసి ముచ్చట వేసిందని.. ఓడిపోయిన బాధను మర్చిపోయానని చెబుతున్నారు.
గ్రామస్తులు ప్రేమాభిమానాలకు తాను ముగ్దుడినయ్యాయని.. గ్రామాభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ధర్మపాల్ వెల్లడించాడు. ప్రజలు ఇచ్చిన డబ్బును వారి కోసమే ఖర్చు పెడతానని వెల్లడించాడు.మరోవైపు ధర్మపాల్ మంచి వ్యక్తి అని గతంలో బ్లాక్ సమితి ప్రెసిడెంట్గా ఎన్నో మంచి పనులు చేశారని ప్రజలు చెబుతున్నారు. ఏటా చదువుల్లో క్రీడల్లో ప్రతిభ చూపినవారిని ధర్మపాల్ సత్కరిస్తున్నారని చీడి గ్రామస్తులు చెబుతుండటం విశేషం.
తెల్లవారి లేచిన దగ్గర నుంచి బూతులు తిట్టుకోవడం ఈ క్రమంలో ఇంట్లో ఆడవాళ్లను పసిపిల్లలను కూడా లాగి అసభ్యంగా బూతులు తిట్టే ఆంధ్రప్రదేశ్ నేతలు చీడి గ్రామస్తులను చూసి కొంచెమైనా సిగ్గు తెచ్చుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.