
కలెక్టర్ పమేలా సత్పతి
జనసముద్రం న్యూస్ కరీంనగర్, నవంబర్ 15
ప్రభుత్వాసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సిబ్బందిని ఆదేశించారు.
శుక్రవారం చొప్పదండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్ పరిశీలించి రోగుల వివరాలు తెలుసుకున్నారు. డెలివరీ రూమ్, వార్డులు, మందులు ఇచ్చే గది పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడున్న పేషంట్లను వైద్య సేవలు ఎలా అందుతున్నాయి.. అవసరమైన మందులు సిబ్బంది అందిస్తున్నారా అని తెలుసుకున్నారు.సౌకర్యాలు సద్వినియోగం చేసుకుంటూ ప్రసవాల సంఖ్య పెంచాలని మెడికల్ ఆఫీసర్ శ్రీకీర్తనకు సూచించారు. చికిత్స, పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చేవారి ఆధార్, ఫోన్ నెంబర్ తీసుకోవాలన్నారు.ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద వైద్య పరీక్షలు చేసుకునే వారి సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఆరోగ్య మహిళ కింద 76 మంది పరీక్షలు చేసుకున్నట్లు కలెక్టర్ కు సిబ్బంది వివరించారు.రికార్డులను సరిగా మెయింటెన్ చేస్తూ ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, ఎంపీడీవో వేణుగోపాల్ రావు, తహసీల్దార్ నవీన్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సిబ్బంది ఉన్నారు.






