ఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలి

Spread the love

స్లాబ్ పెచ్చులు ఊడుతున్న అంగన్వాడి కేంద్రానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలి
–సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ

యాదాద్రి భువనగిరి జిల్లా (నవంబర్.15) జనసముద్రం న్యూస్:

భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలోని ఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని మార్చాలనే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.స్లాబ్ పెచ్చులు ఊడుతున్న అంగన్వాడి కేంద్రానికి వెంటనే నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.శుక్రవారం రోజున భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని రెండవ రోజు నిర్వహించారు.ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ సర్వే సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సామాజిక,ఆర్థిక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని ప్రధానంగా దళిత వాడలో దళిత పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు పౌష్టికాహారం అందించడానికి,ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు ఫ్రీ – స్కూల్ విద్య అందించడానికి అందరికీ అందుబాటులో వారి మధ్యన ఏర్పాటు చేసిన అంగన్వాడి కేంద్రాన్ని వివిధ కారణాలు,కుంటి సాకులు చెప్పి మార్చాలని చూస్తున్న అధికారుల ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే దళితులు విద్యపరంగా,వైద్యపరంగా,ఉపాధిపరంగా,హార్దికపరంగా వెనుకబాటు గురవుతున్న పరిస్థితి ఉన్నదని అన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న దళితుల స్థితిగతులలో మార్పు రాలేదని పాలకులు మారిన దళితుల జీవితాల్లో మాత్రం రాలేదని నేటికీ అనేక రంగాలలో వెనకబాటుకు గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.అనాజిపురం గ్రామంలో దళితవాడలో ఉన్న అంగన్వాడి కేంద్రం దళిత ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని,అలాంటి కేంద్రాన్ని మార్చొద్దని సూచించారు.అంగన్వాడి కేంద్రము 2010 సంవత్సరంలోనే నిర్మాణం చేసినారని అక్కడక్కడ బిల్డింగ్ సంబంధించిన స్లాబు పెచ్చులు ఊడుతున్నాయని వాటికి తక్షణము నిధులు కేటాయించి మరమ్మత్తులు చేపడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని అందుకు జిల్లా కలెక్టర్,స్థానిక ఎమ్మెల్యే స్పందించి నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.మరమ్మతులు చేపట్టకుండా అంగన్వాడి కేంద్రాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని చూస్తే కాలనీ ప్రజలతో ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని నర్సింహ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గునుగుంట్ల శ్రీనివాస్,మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్,కొండపురం యాదగిరి,బొల్లెపల్లి లీల,శాఖ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్,సభ్యులు,గ్రామ ప్రజలు బొల్లెపల్లి స్వామి,బొల్లెపల్లి క్రాంతి,బరిగల నవీన్,బొల్లెపల్లి అంజయ్య,వెంకటస్వామి,బొల్లెపల్లి పద్మ,శారద,బుచ్చమ్మ మొగిలిపాక స్వరూప,చేగూరి అండాలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి

    శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి

    20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనం

    20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనం

    నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్ట

    నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్ట