
జనసముద్రం న్యూస్ హుజూరాబాద్ నవంబర్15
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హుజురాబాద్ శాఖ కార్యవర్గ సమావేశం శుక్రవారం రోజు హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్డులో గల టా ప్ర కార్యాలయంలో కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించనైనది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షనర్స్ హక్కులకు భంగం కలిగించి ఆర్థిక ఇబ్బందులకు గురి చేసే కేంద్ర పౌర సేవలు సిసిఎస్ పెన్షన్స్ సవరణలు ఆర్థిక బిల్లు 2025ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 2024 నుండి పదవి విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ కు అందరికీ కాకుండా కేవలం కొంతమందికి మాత్రమే పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించడం సరైన విధానం కాదని తక్షణమే పెన్షనర్స్ అందరికీ పెన్షనరి బెనిఫిట్స్ చెల్లించాలని లేనిచో పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించేంతవరకు టా ప్ర రాష్ట్ర శాఖ ఆదేశానుసారము తాము దశల వారి పోరాట కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను వెంటనే విడుదల చేస్తూ నూతన పి ఆర్ సి ని జూలై 2023 నుండి అమలు చేయాలని కోరారు.






