
దళితుల సాధికారతకై చలో ఢిల్లీ పిలుపు
రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగాలి ఎమ్మార్పీఎస్
సామాజిక న్యాయ సాధనకు కరపత్రం విడుదల
ప్రతి గ్రామంలో అవగాహన పెంచాలి: ఎమ్మార్పీఎస్ నేతలు
దళితులపై దాడులను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలి
రాజ్యాంగ విలువల రక్షణే సమానత్వ సమాజానికి మార్గం
సీజేఐ గవాయి ఘటనపై ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపు
యువత ముందుకు వస్తేనే అభివృద్ధి సాధ్యం
ఎమ్మార్పీఎస్ కన్వీనర్ అడ్డూరి అనిల్ మాదిగ
కో కన్వీనర్ బొంకూరి కార్తీక్ మాదిగ
ఎల్కతుర్తి 15 నవంబర్,(జనసముద్రం)
ఎల్కతుర్తి మండల అంబేద్కర్ కూడలిలో దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం సాధనకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు ఎమ్మార్పీఎస్ నాయకులు,ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ అడ్డూరి అనిల్ మాదిగ మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న అన్యాయాలు, వివక్షలు, హక్కుల హననాన్ని నిర్మూలించడానికి ప్రతి గ్రామంలోనూ అవగాహన సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గమే సమానత్వ సమాజానికి దారి చూపుతుందని పేర్కొన్నారు.
సమాజంలో మన వర్గాల అభివృద్ధి కోసం చేసిన రాజ్యాంగ పరిరక్షణలను కాపాడుకోవాలి అని దళితులపై జరుగుతున్న దాడులు, హక్కుల ఉల్లంఘనలపై ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఒత్తిడి చెయ్యాలని సమాజం విద్య ఆర్థిక రంగాలలో ముందు కెళ్లాలంటే యువత చైతన్యంతో ముందుకు రావాలి హితవు పలికారు.ప్రస్తుత పరిస్థితుల్లో దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను ఖండించారు దళిత సమాజం ఐక్యంగా ఉంటే ఏ అన్యాయం జరిగినా ఎదుర్కొనే శక్తి ఉంటుందని తెలిపారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయి పైన జరిగిన దాడికి నిరసనను తెలుపుటకు ఈనెల 17వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బొంకూరి కార్తీక్ మాదిగ, చిలుముల రమేష్ మాదిగ, అడ్డూరి శ్రీకాంత్ మాదిగ, గంగారపు రాజు మాదిగ, శనిగరపు వంశీ మాదిగ తదితరులు పాల్గొన్నారు.






