
పదివేల విలువగల 400 విజ్ఞాన పుస్తకాలను అందజేత..
పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతి ప్రధానం..

జన సముద్రం న్యూస్ 15 నవంబర్ బిజినపల్లి మండలం
బిజినపల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈషా ఆస్పత్రి చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ యోజిత బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలకు పదివేల రూపాయల విలువ గల 400 విజ్ఞానం, కథలు, అద్భుత హాస్య, బొమ్మల పుస్తకాలను చిన్నారులకు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో క్లాస్మేట్ క్లబ్ ద్వారా నిర్వహించిన వివిధ పోటీ విజేతలకు బహుమతి ప్రధానం క్లబ్ జిల్లా కోశాధికారి గాడి సురేందర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ గౌడ్,నివేదిత, కృష్ణయ్య ఆనంద్ , ప్రభాకర్,రమ్య, ఉపాధ్యులు నాగేశ్వరీ, స్వాతి, అలేఖ్య, అరుణ,పద్మ,క్లబ్ కోశాధికారి సూర్య కళ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






