జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆగస్టు 27
హుజురాబాద్ పట్టణంలోని శస్త్ర పబ్లీక్ స్కూల్ లో ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రాగడి మట్టి తెచ్చి చక్కనైన గణపతి విగ్రహాలను తయారు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట, పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ వేణు మాధవ్ మాట్లాడుతూ వినాయక చవితి ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒకటన్నారు. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారని, ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలతో పండుగను జరుపుకోవాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా, మట్టి వినాయకుడి విగ్రహాలను తయారు చేసేలా అందరిని విద్యార్ధులు ప్రోత్సహించాలన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. పిల్లలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ముంజాల సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్ధులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.






