జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆగస్టు 27
కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ లోని ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్లో మంగళవారం రోజున ఘనంగా ముందస్తు వినాయక చవితి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని పాఠశాల ప్రాంగణం గణపతి భజనలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో కళకళలాడింది.
విద్యార్థులు ప్రత్యేకంగా సిద్ధం చేసిన గణపతి నృత్యాలు, పాటలు, కవితా పఠనాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ:
“వినాయక చవితి పండుగ భక్తి, ఐక్యత, పర్యావరణ పరిరక్షణ విలువలను నేర్పుతుంది. మట్టి గణపతులను వినియోగించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవచ్చు” అని సూచించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పర్యావరణ హిత గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. మొత్తం స్కూల్ వాతావరణం ఉత్సాహభరితంగా మారింది.






