జనసముద్రం న్యూస్ ప్రతినిధి జన్నారం మండలం
ఆగస్టు 26 మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో జన్నారం మండలంలోని గాంధీనగర్ కాలనీ సమీపంలోని సర్వేనెంబర్ 72 .73. 74. మూడు ఎకరాల సీలింగ్ భూమి ఉన్నదని ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఆ భూమిని కేటాయించాలని జన్నారం మండల తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి కి పేదల గ్రామీణ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు అనంతరం గ్రామీణ పేదల సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలావత్ రామదాసు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు లేక నానా ఇబ్బందులు గురవుతున్న పేద ప్రజలను ప్రభుత్వం తక్షణమే గుర్తించి అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలను కేటాయించాలని వారు కోరారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి ధారంగుల ఎల్లయ్య జిల్లా సహాయక కార్యదర్శి బోడ కిషన్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు ఎనుముల నరసయ్య జిల్లా నాయకులు చందం రాజమౌళి జిల్లా నాయకురాలు దేవరకొండ సంధ్య మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు





