
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జులై.26)
జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మండలం ఘనపూర్ గ్రామ మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేస్తూ తనకు గత పది రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడం వలన తాను వెంటనే సూర్య హాస్పిటల్ ఎండి మనోహర్ ని సంప్రదించడం జరిగిందని,వెంటనే హాస్పిటల్ కి రమ్మని చెప్పడంతో తాను హాస్పిటల్ కి వెళ్లానని,తనకు కొన్ని పరీక్షలు చేయడం వలన గుండెకు సంబంధించిన సమస్య ఉన్నదని తెలుపడంతో వెంటనే మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ కి వెళ్లాలని సూచించారు.తనకు ఏమి చేయాలో తోచని స్థితిలో చామకూర మల్లారెడ్డి ని సంప్రదించడం జరిగినది.వెంటనే స్పందించి మా హాస్పిటల్ కి రావాలని చెప్పడంతో మల్లారెడ్డి హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది.అక్కడికి వెళ్లేసరికి మల్లారెడ్డి అన్ని ఏర్పాట్లు చేసి డాక్టర్లను అందుబాటులో ఉంచి,అన్ని పరీక్షలు చేయించిన తర్వాత తనకు గుండెకు సంబంధించిన స్టంటు వేయడం జరిగిందన్నారు.తన ఆర్థిక స్తోమతను గమనించి తనకు శస్త్ర చికిత్సకు ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా,స్టంట్ వేసి తన ప్రాణాలను కాపాడిన ప్రాణదాత తనకు పునర్జన్మ ఇచ్చిన మల్లారెడ్డికి రుణం ఎప్పటికీ తీరదని,హాస్పిటల్ లో బీదవారికి వారు చేస్తున్న సేవలు చూసి తాను చలించిపోయానని,నిజజీవితంలో దేవుని చూస్తామో లేదో గాని నిజంగా దేవుని రూపంలో మల్లారెడ్డి ని చూసి తాను చాలా గర్వపడుతున్నానని,తనకు పునర్జన్మ నిచ్చిన మల్లారెడ్డి,మనోహర్,డాక్టర్ భద్రారెడ్డికి తాను,తన కుటుంబ సభ్యులు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఘనాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్ తెలియజేశారు.