
జనసముద్రం న్యూస్ జూలై 26 హుజురాబాద్
శుక్రవారం రోజు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకొని సీఎం కి క్షమాపణ చెప్పాలని హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నాయకులు మాట్లాడుతూ మీ బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన చేసి ప్రతి ఎమ్మెల్యే, మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన నీచ నికృష్టమైన ప్రభుత్వం మీది ప్రజా ప్రభుత్వం పై ఎప్పుడు బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని రాష్ట్ర మంత్రులు ఓబీసీ సమావేశాలకు ఢిల్లీకి వెళ్లిన సందర్భాన్ని ఆసరాగా చేసుకొని మాట్లాడడం సరికాదని అన్నారు. లేనియెడల హుజురాబాద్ నియోజకవర్గంలో అడుగడుగునా నిన్ను అడ్డుకొని నియోజకవర్గంలో తిరగనీయమని హెచ్చరిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగినది…