
జనసముద్రం న్యూస్ జూలై 25: డిండి :-
నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ/ ఏటిసిలో ఖాళీగా ఉన్న సీట్ల కొరకు రెండవ విడత అడ్మిషన్ల కొరకై 31-07-2025 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిండి ఐటిఐ ప్రిన్సిపల్ వీరవల్లి రాధాకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆయన మాట్లాడుతూ తమ ఐటిఐలోని ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ మరియు కొత్త అడ్వాన్సుడ్ కోర్సులైన మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్,ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్,బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వైరిఫైయర్ మెకానికల్, ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్స్,అడ్వాన్సుడ్ సిఎన్సి మెషినింగ్ టెక్నీషియన్ మరియు మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ట్రేడ్ల యందు అడ్మిషన్ల కొరకు పదవ తరగతి ఉత్తీర్ణులై,14 సంవత్సరాల వయస్సు పైబడిన అభ్యర్థులు ఈనెల 31వ తేదీ లోగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్,దరఖాస్తు చేసుకోవలసిందిగా ప్రిన్సిపాల్ కోరారు.ఆన్లైన్ అప్లికేషన్ కొరకు ఎస్ఎస్సి మెమో,4 నుండి 10వ తరగతి వరకు బోనఫైడ్,కుల ధ్రువీకరణ పత్రములు,ఈమెయిల్ ఐడి,ఫోన్ నెంబర్,పాస్ ఫోటో మరియు ఆధార్ కార్డు అవసరమని తెలియజేశారు.ఆన్లైన్ అప్లైకి అభ్యర్థుల ఆధార్ కార్డులోని పేరు,పుట్టిన తేదీ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఉండాలని,ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి 100 రూపాయల రుసుము ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందని అభ్యర్థులకు ఈ సందర్భంగా సూచించారు.ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి ఆప్షన్ ఇచ్చుకోవాలని తెలిపారు