
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
— కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా (జులై.26)
జనసముద్రం న్యూస్ :__
:-రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు,విద్యార్థులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు,వాగులు,నాళాలు,డ్రైనేజీలు పొంగిపొర్లె ప్రమాదం ఉందని,అలాగే ఈదురు గాలులు వలన చెట్లు,విద్యుత్ స్తంభాలు,విద్యుత్ తీగలు,పట్ల జాగ్రత్త ఉండాలని,శిథిలావస్థలో ఉన్న గృహాలలో ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని,లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉంటూ,జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజా ప్రతినిధులు,అధికారులు,నాయకులు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని కోరారు.