
—ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపు
యాదాద్రి భువనగిరి జిల్లా (జులై.25)
జనసముద్రం న్యూస్ బీబీనగర్:-నాడు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా నినాదంతో జరిగిన పోరాట స్ఫూర్తితో నేడు మోడీ ప్రభుత్వ అనుకూలమైన కార్పొరేట్స్ కు వ్యతిరేకంగా ఆగస్టు నెలంత దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కిట్ కార్పోరేట్స్ కార్యక్రమంలో పేదలు,వ్యవసాయ కార్మికులు,కార్మికులు,కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపునిచ్చారు.గురువారం రోజున బీబీనగర్ మండల కేంద్రంలోని పి.ఆర్.జి ఫంక్షన్ హాల్ లో జరుగుచున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలకు ముఖ్యఅతిథిగా బి.వెంకట్ పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చాలా దారుణంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చి,దేశ సంపదను వారికి దోచిపెట్టే విధంగా కీలకమైన వ్యవసాయ రంగాన్ని కాజేయడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు.దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు,పేదలు సంపదను దోచుకుంటున్న కార్పొరేట్లను తరిమికొట్టి,వ్యవసాయ రంగాన్ని కాపాడుకొని,గ్రామీణ పేదలను రక్షించుకుందామని వారు పిలుపునిచ్చారు.మోడీ ప్రభుత్వం బహుళ జాతి కంపెనీలకు తలోగ్గి మన వ్యవసాయాన్ని దివాళి తీహించాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.అమెరికా ట్రంప్ ప్రభుత్వానికి బార్లు తెరిచి వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తులను మన దేశంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు మనదేశంలోకి వస్తే ఇక్కడ మన రైతులు పండించే గోధుమలు,మొక్కజొన్న ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనే నాధుడు ఉండడని,దీనివలన మన ఆహార భద్రతకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందని అన్నారు.

దీనిని ప్రజలందరూ తిప్పి కొట్టాలని సూచించారు.మరోపక్క ఆహార భద్రతలో భాగంగా ఇప్పుడు ఇస్తున్న సరుకులను ఇవ్వకుండా నగదు బదిలీని చేయాలని చూస్తున్నాడని,దీని ద్వారా అంబానీ,అదాని ఆస్తులను మరింత పెంచడానికి మోడీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నడని విమర్శించారు.దేశంలో 25 కోట్ల ఫుడ్ కార్డులు,85 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని,వీరందరికీ వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ శక్తులు వస్తే నష్టం జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా రైతులు,కౌలు రైతులు దానిమీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు.దేశంలో మోడీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నారని,కొలతల ద్వారా కూలీలకు డబ్బులు చెల్లిస్తున్న మోడీ ప్రభుత్వం ఎందుకు రోజుకు రెండుసార్లు పని ప్రదేశంలో కూలీలను ఫోటో తీయాలని విధానాన్ని ప్రవేశపెట్టారని ప్రశ్నించారు.ఇప్పటికైనా ఆ విధానాన్ని రద్దుచేసి సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి,రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.వీటి సాధన కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు చేపడతామని,అందుకు అన్ని వర్గాల ప్రజలు ప్రజా సంఘాలు కలిసి రావాలని వెంకట్ పిలుపునిచ్చారు.ఈ సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు,రాష్ట్ర ఆఫీస్ బెరర్స్ బుర్రి ప్రసాద్,బొప్పని పద్మ,నారీ ఐలయ్య,పొన్నం వెంకటేశ్వరరావు,కొండమడుగు నర్సింహ,ములకలపల్లి రాములు,జగన్,జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి,రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు,సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య,గంగాదేవి సైదులు,రాచకొండ రాములమ్మ,రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిరుపంగి స్వామి,కూకుట్ల చొక్కాకుమారి,పల్లెర్ల అంజయ్య,జిల్లా కమిటీ సభ్యులుగాడి శ్రీనివాస్,కొండాపురం యాదగిరి,దొడ్డి బిక్షపతి,నాయకులు ఎరుకల బిక్షపతి,మేకల బాబు,ఓవల్దాస్ సతీష్,సతీష్,శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.