
గోదావరి వరదలు, వర్షాకాలం కావడంతో విష సర్పాలు తిరుగుతుంటాయి, గ్రామ పంచాయితీ వారు తగు చర్యలు తీసుకోవాలి.
ఇరుకు సందులలో, రోడ్లు సైడు కాలువలు నిర్మించాలి.
జనసముద్రం న్యూస్ జూలై 25 బ్యూరో చీఫ్ టెంపుల్ టౌన్ భద్రాచలం
దివ్య క్షేత్రం గా ప్రసిద్ధి చెందిన భద్రాచలం లో అనధికారికంగాసుమారు 60 వేల మంది కి పైగా ప్రజలు నివసిస్తున్నారు. గతంలో టౌన్షిప్ గా, మున్సిపాలిటీగా కొద్ది కాలం పని చేసిన అనుభవం భద్రాచలం గ్రామపంచాయతీకి ఉన్నది.

ఇంటి పన్నులు, ఆక్షన్స్, ఇతర వేలంల ద్వారా మరియు రామాలయం నుండి కూడా గ్రామ పంచాయితీకి ఆదాయం వస్తున్నది. ఈ ఆదాయం మొత్తం సంవత్సరానికి సుమారు ఏడు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా, ఈ ఆదాయానికి త గినట్లు భద్రాచలంలో అన్ని ప్రాంతాల లో అభివృద్ధి పనులు జరగడంలేదని వార్డులలోని ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

భద్రాచలం దివ్య క్షేత్రం పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం కావడం వల్ల ప్రతినిత్యం, శని, ఆదివారాలు , పండుగల రోజులు, శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి మొదలగు ర్వదినాలలో వేల సంఖ్యలో భక్తులు దివ్య క్షేత్రం భద్రాచలానికి వస్తారు. పాపికొండలు చూడడానికి భద్రాచలం మీదుగా వెళ్లే వారి సంఖ్య కూడా వేలలోని ఉంటుంది.
ఈ కారణంగా భద్రాచలం వచ్చిన భక్తులు బస చేయడానికి కావలసిన వసతి గృహాల( లాడ్జీ లు)కూడా అధిక సంఖ్య లోనే నిర్మాణం అవుతు న్నాయి.
గ్రామపంచాయతీ గా ఉన్న పట్టణం లో2 రెండులేక.3 అంతస్తుల కు మించి ఇండ్లను నిర్మించ కూడదని తెలిసినప్పటికీ అధిక అంతస్తుల భవనాల నిర్మాణం జరుగుతూనే ఉన్నది. ఇది ఇలా ఉండగా పట్టణం అభివృద్ధిలో కూడా వివక్ష చూపుతున్నారని అభివృద్ధి జరగని ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ముఖ్యంగా టీటీడీ చౌట్రీకి వెళ్లే మార్గంలో రంగనాయకుల గుట్ట పై ఉన్న ఇరుకు సందులలో గత పదేళ్లుగా రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువల నిర్మాణాలు కూడా జరగడం లేదు, రోడ్లు, సైడు కాలువలు లేకపోవడం పారిశుద్ధ్య పనులు సక్రమంగా లేకపోవడం తో గ్రామపంచాయతీ అజమాయిషి కరువై, పిచ్చి చెట్లు పెరగడం వల్ల, విష సర్పాల సంచారం కూడా జరుగుతోంది. గతంలో ఈ ప్రాంతంలోని ఒక మహిళ పాము కాటుకు గురై 10 రోజులు ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడం కూడా జరిగింది.
ఈ విషయం పంచాయతీ వారికి తెలియజేసి రోడ్లు, డ్రైన్స్ నిర్మించమని గ్రామ పంచాయతీ వారికి దరఖాస్తు చేయడం కూడా జరిగింది.
బెల్లం చుట్టూ ఈగల్లాగా, పెద్ద భవంతుల నిర్మాణాల పట్ల అధిక శ్రద్ధ చూపిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది ఇరుకువీధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు అసలే వర్షాకాలం విషపురుగులు తిరుగుతుంటాయి ఇకనైనా గ్రామపంచాయతీ వారు ఇరుకువీధుల ప్రాంతాల పట్ల శ్రద్ధ పెట్టి, రోడ్లు, సైడు కాలువల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.