
మెట్‌పల్లి పట్టణంలోని చౌదరి శివకుమార్ ను సన్మానిస్తున్న పెయింటింగ్ సంఘం అధ్యక్షుడు ఏశమేని గణేష్ ,
స్వీట్ తినిపిస్తున్న కోశాధికారి
మాతంగి శ్రావణ్
కోరుట్ల నియోజకవర్గం,(జూలై.25)(జనసముద్రం న్యూస్ ): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి పట్టణం కి చెందినలోకల్ టాలెంట్ మెట్ పల్లి బ్యానర్ పై నిర్మించిన బెట్టింగ్ ఒక యువత కథ షార్ట్ ఫిలిం యూట్యూబ్లో ప్రజాద రణ పొందుతున్న శుభసందర్భంగా బెట్టింగ్ ఓ యువత కథ షార్ట్ ఫిలిం డైరెక్టర్ చౌదరి శివకుమార్ ను మెట్ పల్లి పెయింటర్స్& పి ఓ పీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షడు ఏశమేని గణేష్ సంఘం సభ్యులతో కలిసి శాలువకప్పి సన్మానం చేశారు తమ తోటి పెయింటర్ సోదరుడు చౌదరి శివకుమార్ తీసిన సినిమా సక్సెస్ అయినందుకు సంబరాలు జరుపుకు న్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శివ చౌదరి మాట్లాడుతూ బెట్టింగ్ ఓ యువత కథ యూట్యూబ్ లో విడుదల చేసిన వెంటనే అత్యధిక ప్రజాదరణ పొందుతుందని అన్నారు. ఓ సందేశాత్మక చిత్రాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని తెలియజేశారు. చిత్రంలో నటించి,తోడ్పాటు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఏశమేని గణేష్, ఉపాధ్యక్షుడు పొన్నాల ఎల్లేష్, ప్రధాన కార్యదర్శి బిజినపల్లి మనోహర్, రైటర్ అంకమల్ల మహేష్, కార్యదర్శి కాతా వినయ్, జనగాం నరసింహులు, జనగాం సంపత్, మారంపల్లి రాజశేఖర్, సేలార్ ఖాన్, రాజయ్య, అబ్దుల్ వహీద్, అల్లాడి దేవేందర్, తదితరులు పాల్గొన్నారు