
జనసముద్రంన్యూస్:బిక్కవోలు,
జులై:25
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజికవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి వాసుదేవరావు పాఠశాలను సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో బోధనా అంశాలపై చర్చించి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు.అనంతరం విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఏవిధంగా ముందుకు వెళ్లాలో విద్యార్థులకు సూచనలు సలహాలుఅందజేశారు,పాఠశాల పనితీరును ప్రధానోపాధ్యాయులు మరియు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్తిరాజు తెలియజేశారు.పందలపాక ఉన్నత పాఠశాల పనితీరు పట్ల వాసుదేవరావు ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయులను అభినందించారు ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ సాధారణ పర్యవేక్షణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో పందలపాక ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగిందని ఇక్కడ పాఠశాల అన్ని రంగాలలో ముందు ఉండడం ఆనందంగా ఉందని విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాటించవలసిన వివిధ అంశాలను పరిశీలించి సలహాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరు బాధ్యతగా విద్యార్థుల శ్రేయస్సుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.