
జనసముద్రంన్యూస్:బిక్కవోలు
జులై:25
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజికవర్గం బిక్కవోలు మండలంలో ఇటీవల జరిగిన టీచర్ల బదిలీలలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇల్లపల్లి నుండి వివిధ పాఠశాలలకు బదిలీ పై వెళ్లిన ఆరుగురు ఉపాధ్యాయులుకు వీడ్కోలు కార్యక్రమము అంగరంగ వైభవంగా పాఠశాల ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ పప్పు శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించగా ముఖ్య అతిథులుగా మల్లిడి శ్రీనివాసరెడ్డి(ఏం ఎస్ ఆర్),సబ్బెళ్ళ రామచంద్రారెడ్డి (రామలక్ష్మణులు) పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడు
పప్పు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ బదిలీపై వెళ్లిన టీచర్స్ చింతా వీరభద్రరావు, రొంగల సూర్యనారాయణ, ఎం .సూర్యనారాయణ , పి రత్నారావు, కే. ఎ. వి .వి .ఎస్. ఎన్ .కృష్ణప్రసాద్, శ్రీమతి పి సుధా మాధురి ట్రాన్స్ఫర్ పై వెళ్లడం ఇబ్బందికర విషయమైనా వారందరూ కోరుకున్న ఇష్టమైన ప్లేస్ లుకి వెళ్లడం ఆనందదాయకమన్నారు. అతిధుల చేతుల మీదుగా ఘనంగా ట్రాన్స్పరైన టీచర్లకు, ట్రాన్స్ఫర్ పై వచ్చిన టీచర్లకు ఘనంగా సన్మానించారు.పాఠశాలపై అభిమానంతో శ్రీమతి సుధా మాధురి సుమారుగా పదివేల రూపాయల విలువైన వాటర్ కూలర్ పాఠశాలకు బహుకరించడం ఆమె మంచి మనసుకు తార్కాణమని అతిథులు కొనియాడారు. సాంస్కృతిక కార్యక్రమాలకు తర్ఫీదునిచ్చిన విజయలక్ష్మి గారిని సభికులు , అతిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్టాఫ్ సెక్రెటరీ తమలంపూడి ఈశ్వర రెడ్డి, ఉపాధ్యాయులు డి ఎన్ వేద , ఎన్ లక్ష్మీనారాయణ, టి. రామచంద్రారెడ్డి, బండారు శ్రీనివాసరావు, కేతా సత్యనారాయణ, ఎం శరదా జ్యోతి,పి.నాగేశ్వరరావు, కే అరుణ, ఎం. వీర రాఘవులు, జి. రమాదేవి, కర్రీ లక్ష్మి నారాయణరెడ్డి, కే సత్యనారాయణ పాల్గొన్నారు.
సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఇల్లపల్లి హైస్కూల్ నుండి వెళ్లడం వారికి బాధాకరంగా ఉన్నదని చెప్పారు. పాఠశాలకు బదిలీ పై వచ్చిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలకు రావడం తమ అదృష్టంగా భావిస్తున్నాము అన్నారు..