
జనసముద్రం న్యూస్
పల్నాడు జిల్లా ప్రతినిధి
జూలై 25.
జిల్లా జాయింట్ కలెక్టర్, పల్నాడు జిల్లా లోని పౌర సరఫరాల డిప్యూటీ తహసిల్దార్లు మరియు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ ల తో రేషన్ కార్డుదారుల ఐ వి ఆర్ ఎస్ కాల్స్ నందు రేషన్ పంపిణీ పై వ్యతిరేకత వ్యక్తం చేసియున్న మరియు దీపం-2 లబ్దిదారుల నుండి డెలివరి బాయ్స్ రసీదు లో ఉన్న రేటు కంటే ఎక్కువగా వసూలు చేయుట మరియు వారితో దురుసుగా ప్రవర్తించుట గురించి డా. బి.ఆర్. అంబేద్కర్ (పి జి ఆర్ ఎస్) హాలు నందు సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశము నందు జిల్లా జాయింట్ కలెక్టర్ వారు మాట్లాడుతూ జిల్లాలో రేషన్ పంపిణీ విషయమై కార్డుదారులకు రేషన్ పంపిణీ సరిగా చేయడం లేదని, డీలర్లు కార్డుదారులతో దురుసుగా సమాధానం చెబుతున్నారని ఐ.వి.ఆర్.ఎస్ ద్వారా ఫిర్యాదులు అందియున్నవని, వాటిని పునరావృతం రాకుండా డిప్యూటీ తహసిల్దార్లు ప్రతి రేషన్ షాపును తనిఖీ చేసి సంబంధిత కార్డుదారులను విచారించి తగు చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని ఆదేశించియున్నారు. ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ లను కూడా వారి గ్యాస్ డెలివరి బాయ్స్ ను అదనపు డబ్బు వసూలు చేయకుండా తగు ఆదేశములు చేయాలని లేని యెడల వారిపై కఠిన చర్యలు తీసుకొనవలేనని ఆదేశించియున్నారు. లేనియెడల వారి బి-ఫారం లైసెన్స్ రద్దు చేయబడునని హెచ్చరించియున్నారు. ఈ సమావేశము నందు జిల్లా పౌర సరఫరాల అధికారి పల్నాడు వారు పాల్గొనియున్నారు.