
మిర్యాలగూడ పట్టణం.జులై 25.(జనసముద్రం న్యూస్):
మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్రనగర్ ఆశాజ్యోతి మానసిక వికలాంగుల పాఠశాలలో తాజా మాజీ కౌన్సిలర్ మరియు శివాని స్కూల్ అధినేత కుందూరు శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు,ఇట్టి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతో కలిసి మాజీ శాసనసభ్యులు తిప్పల విజయసింహారెడ్డి మరియు బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువ నాయకులు నల్లమోతు సిద్ధార్థ కేక్ కటింగ్ చేపించి విద్యార్థిని విద్యార్థులకు పంచారు,విద్యార్థిని విద్యార్థులు ఆనందంతో కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు,అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థిని విద్యార్థులకు స్వయంగా వడ్డించారు.ఇట్టి కార్యక్రమంలో నాయకులు దుర్గంపూడి నారాయణరెడ్డి,చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి,ఎండి యూసుఫ్,ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి,ఇలియాస్,మాజీద్,పెద్ది శ్రీనివాస్ గౌడ్,కుందూరు వీరకోటిరెడ్డి,ఆంగోతు హాతిరాం నాయక్,సోము సైదిరెడ్డి,పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్,ఎండి షోయాబ్,ఎర్రమళ్ళ దినేష్,తుమ్మల ఫణికుమార్,షహనాజ్ బేగం,కోదాటి రమ,బాచి,పందిరి వేణు,మీసాల జగదీష్,బైరం గోపి,పగిడిమర్రి నాగేంద్ర చారి,గయాస్,ఎలుగుబెల్లి నాగరాజు,కందుల నాగిరెడ్డి,విక్టర్,రవీందర్ నాయక్,నాగరత్నం,గుడిసె దుర్గాప్రసాద్,భీమ్లా నాయక్,పూసల సైదులు,రఫీ బాయ్,బారేద్ది వెంకటరెడ్డి,చందు యాదవ్,చింటూ,వడిత్య శివ,సాయి,షేక్ ఫయాజ్ మరియు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.