
జనసముద్రం న్యూస్
పల్నాడు జిల్లా ప్రతినిధి
జులై 25.
పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో గురువారం నాడు పట్టణ పరిధిలోని పురుగు మందుల దుకాణాల్లో మాచర్ల వ్యవసాయ సహాయ సంచాలకులు తనిఖీలు నిర్వహించారు. వ్యాపారులు అందరూ ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి సరైన అనుమతులు పొందిన విత్తనాలు ఎరువులు మరియు పురుగు మందులను మాత్రమే అమ్మాలని రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని తెలియజేశారు. ప్రతి రైతు కూడా కొనుగోలు చేసిన ఎరువులకు విత్తనాలకు పురుగు మందులకు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని తెలియజేశారు. రైతులు తీసుకున్న బిల్లులు సీజర్ పూర్తి అయ్యేవరకు భద్ర పరుచుకోవాలని తెలిపారు. ఏ వ్యాపారి అయినా ఎరువులు అధిక ధరలకు అమ్మితే కట్టే మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు.