
-ఈనెల 16న ప్రదాని మంత్రి ధన్ దాన్య కృషి యెజన కేంద్రం తీర్మానంను ఆమెదం. కుందుర్పి, జూలై,25,జనసముద్రం. ; . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన అనంతరము జిల్లాను ఉన్నతంగా నిలపేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని పరస్పర సహకార సహాయక సంఘం సభ్యులు కోరారు. గురువారం మండల పరిధిలోని అపిలే పల్లి గ్రామంలో ఆ గ్రామ రెచ్చకట్ట వద్ద మెట్ట రైతుల వ్యవసాయ జీవావరణం పరస్వర సహాయక సహకార సంఘం సభ్యులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రధానమంత్రి కృషి యోజన 2025 నుంచి26వరకు ప్రారంభించి ఆరేళ్లు పాటు 100 జిల్లాల్లో ఈ పథకాన్ని వర్తించేలా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందన్నారు. ఇందులో 11 విభాగాలు ఇతర రాష్ట్ర పథకాలు ప్రైవేటు రంగంలో స్థానిక భాగస్వామితో ఉన్న 36 పథకాల సమ్మేళనంతో పథకం అమలు చేస్తారు .తక్కువ ఉత్పాదకత తక్కువ పంట తీవ్రత తక్కువ రుణ పంపిణీ అని మూడు కీలక సూచికల ఆధారంగా వంద జిల్లాలు గుర్తిస్తారు. సమర్థవంతమైన ప్రణాళిక పధకం అమలు పర్యవేక్షణ కోసం జిల్లా ,రాష్ట్ర, జాతీయస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ప్రదాన మంత్రి ధన్ ధాన్య జిల్లాల్లో పథకం పురోగతిని 117 కీలక పనితీరు సూచికలతో పర్యవేక్షణ చేస్తారు. ఈనెల 16న కేంద్రం మంత్రివర్గం పై నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఇటీవల కేంద్ర క్యాబినెట్లో ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం చే వెనకబడిన జిల్లాలో చేయవలెనని తీర్మానం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాను ఈ పథకంలో చేర్చాలని సభ్యులు తీర్మానం చేశారని గుర్తుచేశారు ఈ పథకంలో భాగంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు కావలసిన ఇన్పుట్, మొదలగు కార్యక్రమాలను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు.. కేంద్ర క్యాబినెట్లో ధన ధాన్య కృషి యోజన పథకం వెనుకబడిన జిల్లాలలో చేయవలెనని తీర్మానం చేయడాన్ని రైతులు హర్షం వ్యక్తం స్తున్నారని వివరించారు. .ఈ గొప్ప కార్యక్రమం ఆచరణలో అమలు అయితే రైతన్నలకు చాలా అనువుగా ఉంటుందని, దీనివల్ల భూతాపం తగ్గుతుందని, వెనకబడిన జిల్లా సైతం అభివృద్ధి దిశగా పయనిస్తుందని సంఘ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ జీవావరణ పరస్పర సహాయక సహకారం సంఘ సభ్యులు, అతావుల్లా, గెజ్జప్ప, నాగరాజు, హనుమంతరాయుడు, అనసూయమ్మ ,జయమ్మ, పార్వతమ్మ , ఉమ,తదితరులు పాల్గొన్నారు.