
జనసముద్రం న్యూస్ రిపోర్టర్ జన్నారం
జులై 11 మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అక్కపెల్లి గూడ,పొనకల్ లోని ప్రైమరీ స్కూల్ల లోని విద్యార్థులకు పీసీఆర్ (పూర్ణచందర్రావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ మాట్లాడుతూ అక్కపెల్లిగూడ ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులకు, పొనకల్ ప్రైమరి స్కూల్ లో 12 మంది విద్యార్థుల కు ఫౌండేషన్ ద్వారా బ్యాగులు పంపిణీ చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాగుల శంకర్,ప్రశాంత్,మూల భాస్కర్ గౌడ్,గంగన్న యాదవ్,దుర్గం తిరుపతి,స్కూల్ హెడ్ మాస్టర్లు జాజల శ్రీనివాస్,రాజేశం,ఉపాద్యాయులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.