
ప్రభుత్వ నిధులతో నూతన బిల్డింగ్ నిర్మించాలి
ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్.
జనసముద్రం న్యూస్ జులై 12
ఎల్కతుర్తి మండలం
ఎస్ఎఫ్ఐ ఎల్కతుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్కతుర్తి లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.స్కూల్ బిల్డింగ్ లో నాలుగు రూములు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి విద్యార్థులకు రూములు లేక ఇబ్బందులకు గురవుతున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి నూతన బిల్డింగ్ నిర్మించాలి అన్నారు అదేవిధంగా

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి అన్నారు, విద్యార్థులు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలన్నారు
లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా వ్యాప్తంగా
ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు బొక్కల పాటి సాల్మన్ రాజ్, మండల కార్యదర్శి అజయ్ తదితరులు పాల్గొన్నారు.