
జన సముద్రం న్యూస్, పినపాక, జులై 12.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం క్రాస్ రోడ్ లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన మంత్రివర్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బీసీల పట్ల ప్రేమతో చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నందుకు పినపాక మండల కాంగ్రెస్ మరియు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున బాణ సంచాలు కాల్చి , రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబురాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గొడిశాల రామనాథం, కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు యువజన కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.