
(జనసముద్రం న్యూస్ ప్రతినిధి,జూలై 12, హుస్సేన్ )
గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎస్ పి లో పనిచేస్తున్న ఎస్ఐ వేణుగోపాల్ ఓ వ్యక్తి నుంచి కుటుంబ కలహాల నేపథ్యంలో లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో రూ.25వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో ప్రమోషన్లో భాగంగా ఎస్సై ఆయన బాధ్యతలు స్వీకరించారు.