
జనసముద్రం న్యూస్ 2 బ్యూరో చీఫ్ టెంపుల్ టౌన్ భద్రాచలం .
భద్రాచలం డివిజన్
దుమ్ముగూడెం మండలం, తూరుబాక గ్రామంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం.
భద్రాచలం నుండి దుమ్మగూడెం, చర్ల, వెంకటాపురం మొదలగు ప్రాంతాలకు ప్రజలు ప్రయాణించడానికి వాహన రవాణాకుప్రధాన రహదారి అయిన తూరుబాక బ్రిడ్జి నిర్మాణం పరిశీలించి త్వరితగతిన వంతెన నిర్మాణం నాణ్యతగాపూర్తి చేయాలని కాంట్రాక్టర్కు,సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే వెంకట్రావు ఆదేశాలు ఇవ్వడం పట్ల భద్రాచలం, దుమ్ముగూడెం, ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే పర్యటనలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.