
జనసముద్రం న్యూస్ జూలై 12: డిండి :-
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్సు తెచ్చినందుకు గాను నల్లగొండ జిల్లా గుండ్లపల్లి డిండి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గడ్డమీది సాయి ఆధ్వర్యంలో జాతీయ రహదారిలో గల రాజీవ్ గాంధీ చౌరస్తాలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గడ్డమీది సాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వారికి పార్టీ పరంగా,ప్రభుత్వ పరంగా ప్రాధాన్యత ఇస్తుందన్నారు.కెసిఆర్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతి కోసం పాటుపడలేదన్నారు. రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుర్రం రాములు, మేకల కాశన్న,బాధమొని శ్రీనివాస్ గౌడ్,నూకం వెంకటేష్, ఎంఏ ఖలీం,ఉమర్ ఖయ్యూమ్,సలీం,పొలం శ్రీను, కటికర్ల సాయిబాబు కటికర్ల పర్వతాలు,కొంపల్లి వేణు, షబ్బీర్,గొడుగు తిరుపతయ్య, హాబీబ్,ఆసిఫ్,శివ తదితరులు పాల్గొన్నారు.